Skip to main content

తెలంగాణ కొత్త జిల్లాల్లో టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్ లేనట్టే..!

సాక్షి, హైదరాబాద్: మార్చి 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వ్యాల్యుయేషన్) ఈసారి కూడా కొత్త జిల్లాల్లో నిర్వహించే అవకాశం లేదు.
జవాబు పత్రాల వ్యాల్యుయేషన్ చేసేందుకు కనీసంగా రెండేళ్ల అనుభవం కలిగిన స్కూల్ అసిస్టెంట్లు కొత్త జిల్లాల్లో లేకపోవడంతో పాత జిల్లా కేంద్రాల్లోనే స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాల్లోనూ స్కూల్ అసిస్టెంట్లు ఎంత మంది ఉన్నారు? అందులో ఏయే సబ్జెక్టు వారు ఎంత మంది? అన్న వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగం సేకరిస్తోంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు అనుభవం కలిగిన సబ్జెక్టు టీచర్లు కొత్త జిల్లాల్లో సరిపడా లేకపోవడంతో పాత జిల్లాల్లోనే వ్యాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం భావిస్తోంది. ఎక్కడైనా టీచర్లు సరిపడా ఉన్నట్లు తేలితే ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని యోచిస్తోంది. మొత్తానికి స్పాట్ వ్యాల్యుయేషన్ వచ్చే నెల చివరి వారంలో ప్రారంభం కానుంది.
Published date : 05 Feb 2020 03:41PM

Photo Stories