పెండింగ్‌లో ఉన్న 10, 12వ తరగతుల పరీక్షలు నిర్వహిస్తాం : సీబీఎస్‌ఈ
Sakshi Education
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా పెండింగ్‌లో పడిన 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను కచ్చితంగా నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ సాన్యం భరద్వాజ్ ఏప్రిల్ 29న చెప్పారు.
లాక్‌డౌన్ కంటే ముందు కొన్ని సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించారు. ఆయా జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశించడానికి వీలుగా అత్యంత ముఖ్యమైన 29 సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్‌ఈ సన్నద్ధమవుతోంది. ఇంకా 40కిపైగా సబ్జెక్టులు పెండింగ్‌లో ఉండగా, 29 సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. పెండింగ్ పరీక్షలు ఎప్పటినుంచి జరుగుతాయన్న దానిపై విద్యార్థులకు 10 రోజుల ముందే నోటీసు ఇస్తామని భరద్వాజ్ తెలిపారు.
Published date : 30 Apr 2020 02:19PM