Skip to main content

పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌: సబితా ఇంద్రారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న సంకల్పంతో స్టడీ మెటీరియల్‌ను రూపొందించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఈమేరకు మంగళవారం స్టడీ మెటీరియల్‌ను మంత్రి తన కార్యాలయంలో విడుదలచేశారు.

తెలంగాణ పదో తరగతి 2021 సిలబస్, ఎగ్జాం టైం టేబుల్, స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్‌ టిప్స్, మోడల్‌ పేపర్స్, కెరీర్‌ గైడెన్స్‌... ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

డిజిటల్‌ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత బలోపేతం చేసేలా, పాఠ్యాంశాల్లోని కీలక భావనలను సులభంగా అర్థమయ్యేలా ఈ స్టడీ మెటీరియల్‌ను ఇంగ్లి‹Ù, తెలుగు, ఉర్దూ భాషల్లో రూపొందించినట్లు వెల్లడించారు. కార్పొరేట్‌ సంస్థలు రూపొందించే నోట్స్‌కన్నా ఈ స్టడీ మెటీరియల్‌ అద్భుతంగా ఉందని మంత్రి ప్రశంసించారు. ప్రస్తుతానికి ఈ స్టడీ మెటీరియల్‌ను www.scert.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులు మాతృభాషలో సాంకేతిక పదాలను నేర్చుకోవడానికి బహుభాషా నిఘంటువును రూపొందించినట్లు చెప్పారు. గణితం, భౌతిక, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం సాంఘిక శాస్త్రాల్లోని సాంకేతిక పదాలను ఆంగ్లం, తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం భాషల్లో రూపొందించామని సబిత తెలిపారు. ఇది ప్రాథమిక పరిభాషపై ప్రావీణ్యం పొందడానికి, ప్రశ్నపత్రాల్లో ఏకరూపతను పాటించడానికి, అనువాదంలో అస్పష్టతను నివారించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
Published date : 07 Apr 2021 05:36PM

Photo Stories