Skip to main content

పాఠశాలల్లో అమల్లోకి వచ్చిన నూతన మెనూ

గార్లదిన్నె/ఏలూరు/తిరుపతి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మార్పు చేసిన మెనూ జనవరి 21 (మంగళవారం)న నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా విద్యార్థులకు మంగళవారం అన్నంతో పాటు పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డుని వడ్డించారు.
పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు మెనూని తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల పరిధిలోని కల్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఎంపీ తలారి రంగయ్య, డీఈఓ శామ్యూల్‌తో కలిసి కలెక్టర్ గంధం చంద్రుడు తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థుల మాదిరి క్యూలో నిల్చొని మధ్యాహ్న భోజనాన్ని పెట్టించుకొని వారితో కలిసి తిన్నారు. అలాగే, చిత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్‌గుప్త తిరుపతి సమీపంలోని మంగళం ట్రెండ్‌‌స ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నూతన మెనూను ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలపర్రు జెడ్పీ స్కూల్లో విద్యార్థులకు నూతన మెనూను డీఈవో రేణుక వడ్డించారు. మిడ్ డే మీల్స్ నూతన మెనూ బాగుందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
Published date : 22 Jan 2020 03:59PM

Photo Stories