Govt Schools: నో అడ్మిషన్ బోర్డులు..ఇక్కడి పాఠశాలల్లో చేర్చాలని తల్లిదండ్రుల ఆరాటం!
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిచింది.
కొత్తగా అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వాటి ఫలితంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలల రూపు రేఖలు మారుతున్నాయి.తల్లిదండ్రులు కూడా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లను కాదని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నిచోట్ల ‘నో అడ్మిషన్’ బోర్డులు వెలుస్తున్నాయి. గడిచిన రెండేళ్లలోనే అత్యధికంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. లాక్‌డౌన్ సడలించి, బడులు తెరిచి మూడు నెలల తర్వాత కూడా ఇంకా కొత్తగా అడ్మిషన్ల కోసం వస్తున్నారని ఉపాధ్యాయులు తెలిపారు.
Published date : 29 Sep 2021 01:42PM