Skip to main content

మూడు రోజులకొకసారి టెన్త్ ఇన్విజిలేటర్ల మార్పు: ఎస్‌ఎస్‌సీ బోర్డు

సాక్షి, అమరావతి:ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఎస్‌ఎస్‌సీ) చర్యలు చేపడుతోంది.
ఇందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్ల నియామకంతో సహా ఎప్పుడు ఏయే చర్యలు చేపట్టాలో సూచిస్తూ డీఈవోలకు సవివర మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్షల నిర్వహణలో కీలకపాత్ర పోషించే ఇన్విజిలేటర్లను ప్రతి మూడు రోజులకు ఒకసారి జంబ్లింగ్ (పరీక్ష కేంద్రాల మార్పు) చేయాలని నిర్ణయించింది. గతంలో పరీక్షలు ప్రారంభమైనప్పుడు మాత్రమే జంబ్లింగ్ చేసి విధులు కేటాయించేవారు. ఇప్పుడు ప్రతి మూడు రోజులకూ జంబ్లింగ్ పద్ధతిలో ఇన్విజిలేటర్లకు పరీక్ష కేంద్రాల కేటాయింపులో మార్పులు చేయనున్నారు.

ఇవీ నూతన మార్గదర్శకాలు
  • ఇన్విజిలేటర్లుగా కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులనే ఎంపిక చేయాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు డెరైక్టర్ ఎ.సుబ్బారెడ్డి మంగళవారం ఆదేశాలిచ్చారు.
  • చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లను ఇతర మండలాల నుంచి పది శాతానికి మించి నియమించకూడదు.
  • ఇన్విజిలేటర్లను కూడా ఇతర మండలాల నుంచి 5 శాతానికి మించి తీసుకోకూడదు.
  • ఇన్విజిలేటర్లకు ప్రతి మూడు రోజులకు ఒకసారి జంబ్లింగ్ విధానం పరీక్షలు ముగిసే వరకు కొనసాగుతుంది.
  • సబ్జెక్టు పరీక్షల సమయంలో ఆ సబ్జెక్టు టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమించకుండా ఇతర సబ్జెక్టు టీచర్లకు బాధ్యతలు అప్పగింత.
  • పరీక్ష కేంద్రాల్లో అవసరమైతే బోధనేతర సిబ్బందిలో ఒక్కరిని మాత్రమే అనుమతిస్తారు.

7 మాధ్యమాలు... 12 రకాల స్కూళ్ల విద్యార్థులు
  • 7 మాధ్యమాలు, 12 కేటగిరీల స్కూళ్లకు చెందిన 6,38,604 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.
  • వీరిలో 6,30,804 మంది రెగ్యులర్ కాగా.. ఒకసారి పరీక్ష ఫెయిలై ప్రైవేటుగా హాజరయ్యే విద్యార్థులు 7,800 మంది.
  • తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీ, తమిళం, కన్నడ, ఒడియా మాధ్యమాల్లో పరీక్ష.
  • రెగ్యులర్ అభ్యర్థుల కోసం 2,881.. ప్రైవేట్ అభ్యర్థులకు 42 పరీక్ష కేంద్రాల ఏర్పాటు.
  • 638 కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించి సీసీ కెమెరాల ఏర్పాటు. వీటిలో వెబ్‌స్ట్రీమింగ్ ద్వారా పరీక్షల పర్యవేక్షణ.
  • రవాణా, వైద్యం, విద్యుత్, ఇతర సదుపాయాల కల్పన.
  • 156 ఫ్లయింగ్ స్క్వాడ్ల నియామకం.
  • ఏప్రిల్ 20 నుంచి స్పాట్ వేల్యూయేషన్ (మూల్యాంకన) ప్రారంభం. ఇందుకోసం 13 జిల్లాల్లో 13 స్పాట్ వేల్యూయేషన్ కేంద్రాల ఏర్పాటు.
  • మే 3వ తేదీతో మొత్తం ప్రక్రియ ముగుస్తుంది.

టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య జిల్లాల వారీగా ఇలా

జిల్లా

స్కూళ్లు

రెగ్యులర్

ప్రైవేటు

శ్రీకాకుళం

684

38,282

448

విజయనగరం

535

30,144

135

విశాఖపట్నం

1,026

56,867

615

తూర్పు గోదావరి

1,167

67,917

35

పశ్చిమ గోదావరి

886

49,036

971

కృష్ణాఖ

1,005

56,749

857

గుంటూరు

1,040

60,045

90

ప్రకాశం

830

41,551

33

నెల్లూరు

758

34,949

3,370

చిత్తూరు

1,139

53,521

82

వైఎస్సార్

839

37,690

288

అనంతపురం

992

51,828

126

కర్నూలు

934

52,225

750

మొత్తం

11,835

6,30,804

7,800

Published date : 11 Mar 2020 03:10PM

Photo Stories