Skip to main content

Andhra Pradesh: పాఠశాలల్లో ఎల్‌ఈడీ వెలుగులు

సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు రెండో దశ స్కూళ్లలో ఎల్‌ఈడీ వెలుగులు విరజిమ్మనున్నాయి.
Andhra Pradesh
పాఠశాలల్లో ఎల్‌ఈడీ వెలుగులు

మన బడి నాడు–నేడు రెండో దశలో రాష్ట్ర ప్రభుత్వం 22,344 స్కూళ్లు, ఇతర విద్యా సంస్ధల్లో రూ.8,000 కోట్లతో పది రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ స్కూళ్లలో 45 వోల్ట్స్‌ కలిగిన 23,367 ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుకు రూ.11.92 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ– టెండర్లను ఆహ్వానించింది. టెండర్‌ దాఖలుకు జూన్‌ 5వ తేదీ గడువుగా పేర్కొంది. బల్బులను స్కూళ్ల వరకు సరఫరా చేయాలనే నిబంధన విధించింది. రివర్స్‌ టెండరింగ్‌లో తక్కువ కోట్‌ చేసిన సంస్ధను ఎంపిక చేయనున్నారు.

చదవండి: School Education Department: ఉచిత విద్యకు ఇంత మంది విద్యార్థులు ఎంపిక

7 వోల్ట్స్‌ కలిగిన 12,636 ఎల్‌ఈడీ బల్బులను హోల్డర్స్‌తో సహా స్థానికంగా ప్రస్తుత ధరలకు కొనే బాధ్యతను తల్లిదండ్రుల కమిటీలకు ప్రభుత్వం అప్పగించింది. ఈమేరకు స్కూల్స్‌ మౌలిక వసతుల కమిషనర్‌ కె. భాస్కర్‌ మే 29న ఆదేశాలు జారీ చేశారు. హైపవర్‌ టెండర్‌ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నిర్ధారించిన స్పెసిఫికేషన్ల మేరకు తల్లిదండ్రుల కమిటీలు ఈ బల్బులు కొనేలా జిల్లా విద్యా అధికారి, అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్లు చర్యలు తీసుకోవాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. నాడు–నేడు రెండో దశలో జూనియర్‌ కాలేజీల్లో ఎలక్ట్రికల్,  శానిటరీ పరికరాలను కూడా స్థానికంగా కాలేజీ అభివృద్ధి కమిటీల ద్వారా కొనాలని కూడా ఆదేశించారు. 

చదవండి: School Fee: ఎల్‌కేజీకి లక్షన్నర!.. సగం ముందే కట్టాలని డిమాండ్‌..

Published date : 30 May 2023 03:07PM

Photo Stories