Skip to main content

రాష్ట్రంలో విద్యా విధానం సంతృప్తికరం

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు అన్నారు.
ks lakshmana rao said that the education system in the state is satisfactory
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు

విజయవాడలోని ఆంధ్రలయోల కళాశాలలో విద్యా సంస్కరణలపై జూలై 10న వర్క్‌ షాప్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా విధానం ఆమోదయోగ్యంగా ఉందన్నారు. పాఠశాల విద్యతో పాటు కళాశాల విద్యలో సైతం ప్రభుత్వం సమూలమైన మార్పులు తెచ్చిందని కొనియాడారు. ముఖ్యంగా ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న అమ్మ ఒడి, విద్యా దీవెన వంటి పథకాల ద్వారా పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని వివరించారు. ఎయిడెడ్‌ కళాశాలల్లో అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అనుబంధ కళాశాల ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసరావు, జనరల్‌ సెక్రెటరీ పి.శ్రీనివాసులు, సదాశివరెడ్డి, మోసెస్, ప్రసాదరావు, లయోల కళాశాల కరెస్పాండెంట్‌ ఫాదర్‌ సహాయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: 

Published date : 11 Jul 2022 01:15PM

Photo Stories