Koushal Science Talent Test: కౌశల్ పరీక్షకు నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, భీమవరం: కౌశల్ క్విజ్ పరీక్ష–2023కు నోటిఫికేషన్ విడుదలైనట్టు పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.వెంకటరమణ తెలిపారు.
స్థానిక జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో కౌశల్–2023 పోస్టర్‌ను అక్టోబర్ 19న ఆయన ఆవిష్కరించారు. క్విజ్ పరీక్షకు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 8,9,10 విద్యార్థులు జట్టుగా ఏర్పడాలన్నారు. ప్రతిభ చూపిన వారికి ప్రశంసా పత్రం, జ్ఞాపిక, నగదు పురస్కారం అందజేస్తారన్నారు.
మరిన్ని వివరాలకు సెల్ 9492566794లో సంప్రదించాలన్నారు. డీవైఈఓ డి.శ్రీరామ్, సూపరింటెండెంట్ తిరుపతిరాజు, కౌశల్ జిల్లా సమన్వయకర్త ఆర్‌వీ సూర్యనారాయణ, జాయింట్ సమన్వయకర్త ఎం.నారాయణరాజు పాల్గొనారు.
చదవండి:
Quiz of The Day (October 20, 2023): గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడే విటమిన్ ఏది?
Published date : 20 Oct 2023 03:49PM