Skip to main content

ఏప్రిల్ 22 నుంచి మే 15 వరకు టెన్త్ విద్యార్థులకు రేడియోలో పాఠాలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పదో తరగతి విద్యార్థుల కోసం ఏప్రిల్ 22 నుంచి మే 15వ తేదీ వరకు రేడియోలో పాఠాలు ప్రసారం చేయనున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ద్వారా ‘విద్యామృతం’ పేరిట విద్యాశాఖ పాఠాలను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. రేడియోలో కూడా రోజూ ఉదయం 11.05 నుంచి 11.35 వరకు (అరగంట సేపు) పదో తరగతి పాఠాల బోధన, పరీక్షల సన్నద్ధతపై కార్యక్రమాలు ప్రసారం చేయనున్నారు. ఈ రేడియో పాఠాలు ఆయా ప్రాంతాల్లోని ఎఫ్.ఎం, ఆకాశవాణి ద్వారా విద్యార్థులు వినేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు.

ఏ రోజుల్లో ఏ సబ్జెక్టు :
తెలుగు:
ఏప్రిల్ 22 - ఏప్రిల్ 24
హిందీ: ఏప్రిల్ 25 - ఏప్రిల్ 27
ఇంగ్లిష్: ఏప్రిల్ 28 - మే 1
గణితం: మే 2 - మే 5
ఫిజికల్ సైన్స్: మే 6 - మే 8
బయోలజికల్ సైన్స్: మే 9 - మే 11
సోషల్ స్టడీస్: మే 12 - మే 15
Published date : 22 Apr 2020 03:51PM

Photo Stories