Skip to main content

ఏపీ టెన్త్ పరీక్షల హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: ఎస్సెస్సీ బోర్డు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను ఎస్సెస్సీ బోర్డు సిద్ధం చేసింది.
వీటిని గురువారం (19వ తేదీ) మధ్యాహ్నం నుంచి బోర్డు వెబ్‌సైట్  www.bseap.org నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఎ.సుబ్బారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్లు తమ స్కూల్ లాగిన్ ద్వారా స్కూల్ కోడ్ పాస్‌వర్డ్‌ను టైప్‌చేసి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. వాటిపై అటెస్టేషన్ చేసి విద్యార్థులకు అందించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు ఈ హాల్ టికెట్లను తమ వద్ద ఉండే ఫొటో అటెండెన్స్ షీట్లతో సరిచూసుకొని విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని పేర్కొన్నారు. టెన్‌‌త పబ్లిక్ పరీక్షలు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.15 వరకు రోజూ జరుగుతాయి.

AP SSC 2020 New Pattern Model papers
Published date : 19 Mar 2020 02:54PM

Photo Stories