Skip to main content

AP Tenth Supplementary Dates 2025 : రేప‌టి నుంచే ఏపీ టెన్త్ స‌ప్లిమెంట‌రీకి ద‌ర‌ఖాస్తులు ప్రారంభం.. ముఖ్య‌తేదీలు, వివ‌రాలు ఇవే..

నేడు విడుదలైన ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో 81.14 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు.
AP 10th Class Results 2024 Announcement  AP tenth supplementary applications and fees details with exam dates

సాక్షి ఎడ్యుకేష‌న్‌: నేడు విడుదలైన ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో 81.14 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. అందులో బాలిక‌ల‌ది పైచేయిగా నిలిచింది. అయితే, కొంద‌రు విద్యార్థులు ప‌లు స‌బ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. వారి కోసం మ‌రోసారి ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌లే.. స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు, ఇక‌, వచ్చేనెల.. మే 19వ తేదీ నుంచి ఈ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు కూడా ఎన్ని స‌బ్జెక్టుల్లో ఫెయిల్ అయినా కూడా ఈ పరీక్ష‌ల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు.

ద‌ర‌ఖాస్తుల వివ‌రాలు..

వ‌చ్చేనెల మే లో ప్రారంభం కానున్న టెన్త్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తులు రేప‌టి నుంచే ప్రాంర‌భం కానుంది.

1680 Schools in AP Tenth Results 2025 : ఏపీ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌.. 1,680 స్కూళ్ల‌లో 100 శాతం పాస్ రేట్‌.. ఈసారి కూడా..

విద్యార్థులంతా, https://www.bse.ap.gov.in/ సైట్‌ను సంద‌ర్శించి HM లాగిన్‌తో త‌మ ద‌ర‌ఖాస్తుల‌కు కావాల్సిన వివ‌రాల‌తో పూర్తి చేసుకోవాలి. అంతేకాదు, త‌క్కువ మార్కులు వ‌చ్చాయి అని దిగులుపడుతున్న విద్యార్థులు, అనుకున్న మార్కులు రాని విద్యార్థులకు సైతం రీకౌంటింగ్‌, రీవెరిఫికేష‌న్‌ను ప్ర‌క‌టించారు. దీని కోసం, విద్యార్థులు ద‌ర‌ఖాస్తుల‌తోపాటు ఫీజుల‌ను కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఫీజుల వివ‌రాలు..

స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు రేప‌టి నుంచి ఈనెల 30వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు. ఆల‌స్య రుసుము రూ.50తో వ‌చ్చేనెల.. మే 19వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు. ఇక‌, రీకౌంటింగ్‌కు లేదా, రీవెరిఫికేష‌న్‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలంటే, ఫీజుల చెల్లింపు స‌బ్జెక్టు వారీగా ఉంటుంది. ఇందులో, ఒక్కో స‌బ్జెక్ట్‌కు రూ.500 రీ కౌంటింగ్‌కు కాగా, రూ.1000 రీవెరిఫికేష‌న్‌కు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ మే 1వ తేదీగా ప్ర‌క‌టించారు.

ఇక‌, ఏపీ టెన్త్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 23 Apr 2025 12:49PM

Photo Stories