సాక్షి, అమరావతి: మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న మైనార్టీ కేటగిరి ఖాళీలతోపాటు మూడు మైనార్టీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అర్హులైన మైనార్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలసంస్థ కార్యదర్శి ఆర్.నరసింహరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
https://aprs.apcfss.in వెబ్‌సైట్ ద్వారా లేదంటే ఆయా కాలేజీలు, పాఠశాలల్లో ఉచితంగా దరఖాస్తు పొంది అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జతచేసి ప్రవేశం కోరుకునే విద్యాసంస్థ ప్రధానాచార్యులకు ఇవ్వాలని సూచించారు. ఖాళీలు, అర్హతలు, ఇతర మార్గదర్శకాలను వెబ్‌పోర్టల్ ద్వారా లేదా ఆయా విద్యాసంస్థల నుంచి పొందవచ్చని పేర్కొన్నారు.