1-10వ తరగతి విద్యార్థులకు నేటి నుంచి సప్తగిరి ఛానెల్‌లో పాఠ్యాంశాలు ప్రసారం
Sakshi Education
సాక్షి, అమరావతి: దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ద్వారా రాష్ట్రంలోని 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనను పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష కొనసాగిస్తున్నాయి.
సెప్టెంబర్ మాసానికి సంబంధించిన పాఠ్యాంశాల బోధన ప్రణాళికను సోమవారం విడుదల చేశాయి.
- లాక్‌డౌన్ సమయంలో, ఆ తరువాత కూడా విద్యాశాఖ టెన్‌త విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి సన్నద్ధతకు వీలుగా పాఠాలను దూరదర్శన్ ద్వారా రోజూ 2 గంటలపాటు ప్రసారం చేయించింది.
- తరువాత ఇతర తరగతుల విద్యార్థులకు బ్రిడ్జికోర్సు, విద్యావారథి పేరిట పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారాలను కొనసాగించింది.
- అన్‌లాక్ 4లో సెప్టెంబర్ 1 నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలను బోధించాలని కేంద్రప్రభుత్వం సూచించడంతో ఆమేరకు ఏర్పాట్లు చేశారు.
- ఈ మేరకు స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రయినింగ్ (సీమ్యాట్) డెరైక్టర్ వీఎన్ మస్తానయ్య మెమో జారీచేశారు.
- సెప్టెంబర్ 10 వరకు రోజువారీగా ఆయా తరగతులకు బోధన జరిగే అంశాల షెడ్యూల్‌ను ప్రకటించారు. వారంలో అయిదు రోజుల పాటు ఈ ప్రసారాలు ఉంటాయి. ప్రతి రోజూ ఆరుగంటలపాటు ప్రసారం చేస్తారు.
Published date : 01 Sep 2020 03:44PM