భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

  • సామాజిక రంగంలో భారతదేశం అభిలషణీయమైన ప్రగతిని సాధించలేదని, సాధించాల్సింది ఇంకా చాలా ఉందని పేర్కొన్నవారు?
    జిన్ డ్రీజ్, అమర్త్యసేన్
  • అమెరికా.. విద్యపై పెట్టిన పెట్టుబడుల వల్ల ఆ దేశ సగటు జాతీయాదాయం 4.2 శాతం మేర పెరిగిందని అంచనా వేసింది?
    సూల్జ్, గ్యారీబీకర్
  • రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను అనుసరించి ఏ వయసు పిల్లలకు తప్పనిసరిగా ప్రాథమిక విద్యను అందించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది?
    6-14 సంవత్సరాలు.
  • ప్రాథమిక విద్యను బోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధ్రువీకరించిన కమిషన్?
    కొఠారి కమిషన్
  • ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తిలో ప్రగతి నమోదు చేసినవి?
    గోవా, తమిళనాడు, పుదుచ్చేరి.
  • 2002లో రూపొందించిన జాతీయ ఆరోగ్య విధానం లక్ష్యాలు?
    ఆరోగ్య రంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను పెంచటం, వికేంద్రీకృత ప్రజా ఆరోగ్య పద్ధతులకు అవకాశం కల్పించటం.
  • జాతీయ నీటి సరఫరా, పారిశుద్ధ్యం పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం?
    1954
  • వేగవంతమైన గ్రామీణ నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం?
    1972-73
  • రాజ్యాంగంలోని ఏ అధికరణ.. మహిళలు, పురుషులకు సామాజిక, ఆర్థిక రంగాల్లో సమాన అవకాశాలను కల్పిస్తోంది?
    14వ అధికరణ
  • 2013లో శిశు మరణాల రేటు (ప్రతి వెయ్యి జననాలకు) అధికంగా నమోదైన రాష్ట్రాలు?
    మధ్యప్రదేశ్, అసోం
  • 2013లో తమిళనాడులో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు?
    21
  • 2011 లెక్కల ప్రకారం బీహార్ జనాభాలో పట్టణ జనాభా శాతం?
    11.3 శాతం
  • ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం వ్యయంలో భాగంగా ఆహారంపై అధిక వ్యయం చేసిన రాష్ట్రం?
    అసోం
  • 2011-12లో బీహార్ గ్రామీణ ప్రాంతాల్లో తలసరి వినియోగ వ్యయం నెలకు (రూపాయల్లో)?
    రూ.1127
  • 2011-12లో పట్టణ ప్రాంతాల మొత్తం వ్యయంలో భాగంగా ఆహారంపై తక్కువ వ్యయం చేసిన రాష్ట్రం?
    కేరళ
  • 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో అధికంగా పెరిగిన జనాభా?
    91 మిలియన్లు
  • 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా వృద్ధి (శాతాల్లో)?
    31.8 శాతం
  • అధిక పట్టణ జనాభా కలిగిన రాష్ర్టం (శాతాల పరంగా)?
    గోవా
  • ఢిల్లీ తర్వాత అధిక పట్టణీకరణ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం?
    చండీగఢ్
  • ప్రాంతీయ అసమానతలను సూచించే అంశాలను పేర్కొంది?
    రాజ్‌కృష్ణ
  • కేంద్ర ప్రణాళికా విధానం కంటే జిల్లా, బ్లాక్, రాష్ట్ర స్థాయిలో గ్రామీణ పథకాలను రూపొందించాలని సూచించింది?
    కె.ఎన్. రాజ్
  • జిల్లాలు, రాష్ట్రాల స్థాయిలో ప్రణాళికా నిర్ణయాలు జరిగితే సంతులిత ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపింది?
    ఎన్.చక్రవర్తి
  • జిల్లాను యూనిట్‌గా, తిరిగి జిల్లాను కూడా చిన్న ఖండాలుగా విభజించి ప్రణాళికలు రూపొందించాలని సూచించింది?
    డి.ఆర్.గాడ్గిల్
  • కేరళ తర్వాత 2001-2011 మధ్యకాలంలో అధిక పట్టణ జనాభా వృద్ధిని నమోదు చేసిన రాష్ర్టం?
    సిక్కిం
  • జిల్లా స్థాయిలో బ్లాక్ ప్రణాళికలు రూపొందించాలని పేర్కొంది?
    వీకేఆర్‌వీ రావ్, అలఘ్
  • గ్రామ స్థాయి నుంచి ప్రాంతీయ ప్రణాళికలు రూపొందించినప్పుడు ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పిన వ్యక్తి?
    ఎల్.ఎస్ భట్
  • 11వ ప్రణాళికలో ఆర్థికంగా ముందజంలో ఉన్న రాష్ట్రాల్లో గరిష్ట వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రం?
    గుజరాత్
  • పదకొండవ ప్రణాళికలో బీహార్ సాధించిన సగటు వృద్ధిరేటు?
    12 శాతం
  • 1990-91లో తలసరి ఆదాయంలో మొదటి స్థానం పొందిన రాష్ట్రం?
    పంజాబ్
  • సంస్కరణల తర్వాత కాలం నుంచి దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 69.2 శాతం అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు తరలిపోయిందని పేర్కొన్న వ్యక్తి?
    ఎం.జె. కురియన్
  • సంస్కరణల కాలంలో భారతదేశంలోని విత్తసంస్థల నుంచి అధికంగా ఆర్థిక సహాయం పొందిన రాష్ట్రాలు?
    మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
  • మొత్తం పంట భూమిలో సాగునీటి వసతి అధికంగా ఉన్న రాష్ట్రం?
    పంజాబ్
  • అవస్థాపనా అభివృద్ధి సూచీ దేన్ని తెలుపుతుంది?
    అవస్థాపనా సౌకర్యాల లభ్యత
  • అవస్థాపనా అభివృద్ధి సూచీలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
    పంజాబ్
  • 1980 నుంచి భారత్‌లో ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయని పేర్కొంది?
    ఎంజే కురియన్
  • నేషనల్ శాంపుల్ సర్వే 68వ రౌండు ప్రకారం బీహార్‌లో నమోదైన పేదరికం?
    33.7 శాతం
  • 2013లో భారతలో శిశు మరణాలు (ప్రతి వెయ్యి జననాలకు)?
    40
  • ఏ పంటకు సంబంధించిన వంగడాల కార్యక్రమం (అధిక దిగుబడి ఇచ్చే) కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని విమర్మ ఉంది?
    గోధుమ
  • 2013-14లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పంజాబ్, హరియాణాల వాటా?
    7.5 శాతం
  • 2013-14లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పాదకత ఏ రాష్ట్రంలో ఎక్కువ?
    పంజాబ్
  • 2013-14లో ఎరువుల వినియోగ సగటుతో పోల్చినప్పుడు ఏ రాష్ట్రాల్లో ఎరువుల వినియోగం ఎక్కువ?
    పంజాబ్, హరియాణ
  • 2013లో శిశు మరణాల రేటుకు సంబంధించి తక్కువ శిశు మరణాలు నమోదైన రాష్ట్రం?
    కేరళ
  • భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఆయుః ప్రమాణం తక్కువగా నమోదవుతోంది?
    మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా
  • 2011-12లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి తలసరి సగటు వినియోగ వ్యయం ఏ రాష్ట్రంలో ఎక్కువ?
    కేరళ
  • 2011-12లో పట్టణ ప్రాంతాలకు సంబంధించి తలసరి సగటు వినియోగ వ్యయం (నెలకు) ఏ రాష్ట్రంలో ఎక్కువ?
    హరియాణ
  • వలసలు, జనాభా సహజ పెరుగుదల భారతదేశంలో దేనికి కారణం అవుతున్నాయి?
    పట్టణీకరణ
  • 2001-11 మధ్యకాలంలో అధిక జనాభా వృద్ధి నమోదు చేసిన నగరం?
    ఢిల్లీ
  • 2011 లెక్కల ప్రకారం భారతదేశంలో పట్టణ జనాభా?
    37.7 కోట్లు
  • మురికివాడలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
    తమిళనాడు
  • మురికివాడల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
    మహారాష్ట్ర
  • 2001తో పోల్చినప్పుడు 2011లో హిందూ జనాభా శాతం?
    తగ్గింది
  • ముస్లిం జనాభా (శాతం పరంగా) ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఎక్కువగా ఉంది?
    లక్ష దీవులు
  • దేశంలోని ఎంతశాతం ప్రజలు ఏ మతానికి చెందని వారుగా ఉన్నారు?
    0.2 శాతం
  • Slum Free India అనేది ఏ పథక నినాదం?
    రాజీవ్ ఆవాస్ యోజన
  • పంజాబ్ తర్వాత తలసరి విద్యుత్ వినియోగం ఏ రాష్ట్రంలో ఎక్కువ?
    తమిళనాడు
  • తలసరి బ్యాంకు డిపాజిట్లు ఏ రాష్ట్రంలో ఎక్కువగా నమోదవుతున్నాయి?
    ఢిల్లీ
  • అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గించొచ్చని పేర్కొన్న ప్రణాళిక?
    12వ ప్రణాళిక
  • రఘరామ్ రాజన్ మల్టి డైమన్షనల్ ఇండెక్స్ ప్రకారం అభివృద్ధిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు?
    గోవా, కేరళ
  • ఎక్కువ మంది జనాభా, వస్తు ఉత్పత్తి రంగం కేంద్రీకృతమైన ప్రదేశాలను అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా వర్ణించింది?
    కోలిన్ క్లార్క్
  • ప్రతి వెయ్యి చదరపు కిలోమీటర్లుకు రోడ్ల విస్తరణ అధికంగా ఉన్న రాష్ర్టం?
    కేరళ
  • ప్రతి వెయ్యి చదరపు కిలోమీటర్లుకు రోడ్ల విస్తరణ తక్కువగా ఉన్న రాష్ర్టం?
    బీహార్





























































#Tags