TSPSC Group 4 Results Out: గ్రూప్‌-4 ఫలితాలు విడుదల,మీ ర్యాంక్‌ ఇలా చూసుకోండి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 6,180 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించిన అర్హత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును శుక్రవారం తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)విడుదల చేసింది.

ఈ జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ 22 డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... గతేడాది జూలై 1వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఓఎంఆర్‌ ఆధారితంగా పరీక్షలు నిర్వహించారు.

గ్రూప్‌-4 మొత్తం ఎంత మంది రాశారంటే..
ఉదయం జరిగిన పేపర్‌–1(జనరల్‌ స్టడీస్‌) పరీక్షకు 762872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్‌–2 పరీక్షకు 761198 మంది అభ్యర్థులు హాజరయ్యారు.  పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జవాబుపత్రాలను మూల్యాంకనం చేసిన టీఎస్‌పీఎస్సీ.... తాజాగా 7,26,837మంది అభ్యర్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచింది.

త్వరలోనే షార్ట్‌లిస్ట్‌
ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థుల జాబితాను త్వరలో షార్ట్‌లిస్ట్‌ చేసి వెల్లడించనున్నట్లు కమిషన్‌ కార్యదర్శి నవిన్‌ నికోలస్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులను ఈ జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు. 
 

#Tags