TSPSC: వెబ్‌సైట్‌లో వీఏఎస్‌ అభ్యర్థుల హాల్‌టికెట్లు.. మాక్‌టెస్ట్‌ కోసం క్లిక్‌ చేయండి

సాక్షి, హైదరాబాద్‌: పశు సంవర్ధక శాఖ పరిధిలోని వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (వీఏఎస్‌) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్‌టికెట్లు టీఎస్‌ పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి.
టీఎస్‌ పీఎస్సీ వెబ్‌సైట్‌లో వీఏఎస్‌ అభ్యర్థుల హాల్‌టికెట్లు.. మాక్‌టెస్ట్‌ కోసం క్లిక్‌ చేయండి

అభ్యర్థులు వీటిని వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కమిషన్‌ కార్యదర్శి సూచించారు. జూలై 13, 14 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5వరకు వీఏఎస్‌ అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

హాల్‌టికెట్‌తో పాటు నిబంధనలు సైతం వెబ్‌ సైట్‌లో ఉన్నాయని, వాటిని అభ్యర్థులు తప్పకుండా అనుసరించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు మాక్‌టెస్ట్‌లో పాల్గొన వచ్చని, ఇందుకు కమిషన్‌ వెబ్‌సైట్‌ తెరిచి నిర్దేశించిన లింకు ద్వారా పరీక్ష రాయొచ్చని సూచించారు. 

Mock Tests - Click Here

#Tags