TS TET Exam Dates and Syllabus 2025 : టెట్ 2025 సిల‌బ‌స్ విడుద‌ల‌.. ప‌రీక్ష తేదీలు ఇవే.. ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ విద్యాశాఖ టెట్ సిల‌బ‌స్‌ను విడుద‌ల చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ మేర‌కు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంలో నిర్వ‌హించిన‌ టెట్‌కు, ఈ టెట్‌ సిలబస్‌లో ఎటువంటి మార్పు లేద‌న్నారు.

ఇది రెండోసారి..
డిసెంబ‌ర్‌ 5 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో TETకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది టెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం ఇది రెండోసారి. జాబ్‌ క్యాలెండర్‌లో ఏడాదికి రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

రెండు పేపర్లుగా టెట్‌ :

    డీఈడీ, బీఈడీ అర్హతతో నిర్వహించనున్న టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌)లో రెండు పేపర్లు ఉంటాయి. అవి.. పేపర్‌–1, పేపర్‌–2. 
    పేపర్‌–1: ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధించేందుకు, ఎస్‌జీటీ పోస్ట్‌ల అభ్యర్థులు పేపర్‌ 1కు హాజరవుతారు. ఇంటర్మీడియెట్‌/తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డిప్లామా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పాసైన వారు పేపర్‌–1కు దరఖాస్తు చేసుకోవచ్చు.
    పేపర్‌–2: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించేందుకు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ప్రామాణిక పరీక్ష టెట్‌ పేపర్‌–2. బీఏ/బీఎస్సీ/బీకాంలలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) లేదా నాలుగేళ్ల బీఏ ఎడ్యుకేషన్‌/బీఎస్సీ ఎడ్యుకేషన్‌లలో ఉత్తీర్ణత లేదా నాలుగేళ్ల బీఏ బీఈడీ/బీఎస్సీ బీఈడీలలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. 
    లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్ట్‌ల అభ్యర్థులు సంబంధిత లాంగ్వేజ్‌ ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా బ్యాచిలర్‌ డిగ్రీ లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఓరియెంటల్‌ లాంగ్వేజ్‌/లిటరేచర్‌లో బ్యాచిలర్‌ లేదా పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతోపాటు లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ లేదా సంబంధిత లాంగ్వేజ్‌ మెథడాలజీలో బీఈడీ ఉత్తీర్ణత పొందాలి. (లేదా) బీఈ/బీటెక్‌లో 50 శాతంతో ఉత్తీర్ణత సాధించి బీఈడీ/బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ చదువుతున్న వారు కూడా అర్హులే. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు సైతంటెట్‌ పేపర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

TET పేపర్‌–1 :

టెట్‌ పేపర్‌–1ను అయిదు విభాగాల్లో 150 ప్రశ్నలు–150 మార్కులకు కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహిస్తారు.అవి..చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి(30 ప్రశ్నలు–30 మార్కులు), లాంగ్వేజ్‌–1(30 ప్రశ్నలు–30 మార్కులు), లాంగ్వేజ్‌–2 (30 ప్రశ్నలు–30 మార్కులు), మ్యాథమెటిక్స్‌ (30 ప్ర.–30 మా.), ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ (30 ప్ర.–30 మా.) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి విభాగంలో ఆరు ప్రశ్నలు పెడగాజీ నుంచి ఉంటాయి. 

For TET పేపర్‌–1 సిల‌బ‌స్‌ - Click Here

TET పేపర్‌–2 :

టెట్‌ పేపర్‌–2ను కూడా నాలుగు విభాగాలుగా 150 ప్రశ్నలు–150 మార్కులకు కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఈ పేపర్‌ పూర్తిగా బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి 30 ప్రశ్నలు–30 మార్కులకు; లాంగ్వేజ్‌1, 30 ప్ర­శ్నలు–30 మార్కులకు; లాంగ్వేజ్‌ 2, (ఇంగ్లిష్‌) 30 ప్రశ్నలు–30 మార్కులకు; సంబంధిత సబ్జెక్ట్‌ 60ప్రశ్నలు–60 మార్కులకు ఉంటాయి. నాలుగో విభాగంలో మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ టీచర్స్‌ అభ్యర్థు­లు మ్యాథ్స్,సైన్స్‌ విభాగాన్ని.. సోషల్‌ టీచర్లు సోష­ల్‌ స్టడీస్‌ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాలి.

For TET పేపర్‌–2 సిల‌బ‌స్‌ - Click Here

కనీస అర్హత మార్కులు ఇవే..

రెండు పేపర్లుగా నిర్వహించే టెట్‌ పేపర్‌–1, పేపర్‌–2లలో అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాలనే నిబంధన విధించారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఈ మార్కులు సాధించిన వారికే టెట్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తారు.

#Tags