TS Constable Final Exam Question Paper 2023 PDF : కానిస్టేబుల్ ఫైనల్ రాత పరీక్ష కొశ్చన్ పేపర్ ఇదే.. ఈ సారి ప్రశ్నలు ఎలా వచ్చాయంటే..
ఈ ఫైనల్ రాతపరీక్షకు సంబంధించిన కొశ్చన్ పేపర్‌ను సాక్షి ఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి సివిల్, ఏఆర్ పోస్టులతోపాటు టీఎస్‌ఎస్పీ, ఎస్పీఎప్, ఫైర్, జైళ్లశాఖ, ఎక్సైజ్ , రోడ్డు ట్రాన్స్‌పోర్టు సంబంధించిన పోస్టులు ఉన్నాయి.
ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫైనల్ రాతపరీక్ష ‘కీ’ ని ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయిస్తున్నారు. ఈ 'కీ' ని అభ్యర్థుల ప్రాథమిక అంచనా కోసం మాత్రమే రూపొందించడం జరుగుతుంది. ప్రభుత్వం విడుదల చేసే 'కీ' నే ప్రామాణికంగా పరిగణించండి.
16,321 కానిస్టేబుల్ పోస్టులకు..
16,321 కానిస్టేబుల్ పోస్టులకు ఈ భర్తీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అన్ని పోస్టులకు కలిపి దేహదారుఢ్య పరీక్షలకు 2,07,106 మంది అభ్యర్థులు హాజరుకాగా, వీరిలో 1,11,209 మంది తుది రాత పరీక్షలకు ఎంపికయ్యారు.
టీఎస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫైనల్ రాతపరీక్ష కొశ్చన్ పేపర్ & ‘కీ’ ఇదే.. : (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన పరీక్ష కొశ్చన్ పేపర్)