SatyaNarayana, IPS: : ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత శిక్షణ.. దరఖాస్తు చేసుకోండిలా..
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్పీ, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాల్లో అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. ఎస్సై, కానిస్టేబుల్ విభాగాలలో గ్రామీణ యువతకు మెరుగైన శిక్షణ అందించి.. వారిని పోలీసు పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేసేందుకు అన్ని వనరులను వినియోగిస్తామని కరీంనగర్ సీపీ, డీఐజీ పి.సత్యనారాయణ చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసు ఉద్యోగం సాధించాలనే యువతకు కరీంనగర్ సీపీ, డీఐజీ పి.సత్యనారాయణ సూచనలు.. సలహాలు మీకోసం.
TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చదివితే పోలీస్ ఉద్యోగం మీదే..!
ఉద్యోగాలిస్తామని ఎవరు చెప్పినా నమ్మవద్దని.. దళారులు ఎవరైనా..
ఏప్రిల్ 12, 13వ తేదీల్లో డిపార్ట్‌మెంటు వారు నిర్వహించే ఎత్తు, ప్రవేశ పరీక్షల్లో పాల్గొనాలని యువతకు సీపీ సూచించారు. ఉద్యోగాలిస్తామని ఎవరు చెప్పినా నమ్మవద్దని.. దళారులు ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే తమకు తెలియజేయాలని స్పష్టంచేశారు. పోలీసు కావాలన్న మీ స్వప్నానికి తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇంకా నిరుద్యోగులకు పోలీసు శిక్షణకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆయన సాక్షితో పంచుకున్నారు.
తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ పరీక్షల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి
సాక్షి: పోలీసుల ఆధ్వర్యంలో జరగబోయే శిక్షణ ఎలా ఉండబోతోంది?
సీపీ: ఇది కేవలం పోలీసుశాఖ మాత్రమే కాదు.. కలెక్టర్, వారధి సొసైటీల సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించాం. ముఖ్యంగా పేద విద్యార్థులు, ప్రతిభ కలిగిన గ్రామీణ యువతకు అత్యున్నత శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యం మేరకు ముందుకెళ్తున్నాం.
శిక్షణ ఎలా ఇవ్వనున్నారు?
ఎస్సీ యువతకు ప్రత్యేక కోటా కింద ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తాం. అదే సమయంలో మహిళలకు ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తాం. కరీంనగర్ నగరం ఒకప్పుడు ఉమ్మడి జిల్లా కేంద్రం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నాం. ఇక్కడ కోచింగ్‌లో ఉమ్మడి జిల్లా నుంచి ఆసక్తి గలిగిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
Competitive Exams: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా..? కాదా..?
దరఖాస్తు విధానం ఎలా ఉండబోతోంది?
ఆన్‌లైన్‌లో గానీ, ప్రత్యక్షంగా గానీ రెండు రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 12, 13 తేదీల్లో జరిగే పరీక్షలకు హాజరైన వారిని స్క్రీనింగ్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తాం. ఎంపిక ప్రక్రియ అంతా పారదర్శకం. మొత్తం ఈవెంట్లన్నీ వీడియో తీస్తాం.
శిక్షణ సిబ్బంది కోసం ఏర్పాట్లు జరిగాయా..?
మా సీనియర్ సిబ్బందితోపాటు ఇటీవల డిపార్ట్‌మెంటులో చేరిన యువ ఎస్సై, ఆర్‌ఎస్సైలు పాఠాలు బోధిస్తారు. అంతే కాకుండా పలు ప్రముఖ కోచింగ్ సెంటర్ల నుంచి సీనియర్ ఫ్యాకల్టీని తీసుకువచ్చి పాఠాలు బోధింపజేస్తాం. అందుకు ఎంత ఖర్చయినా వెనకాడం. అంతిమంగా అభ్యర్థులకు నాణ్యమైన అంశాలు బోధించడమే మా లక్ష్యం.
కోచింగ్ కోసం ఏవైనా ప్రణాళికలు రూపొందించారా..?
ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిలబస్‌లో బేసిక్స్ నుంచి మొదలుకుని జనరల్ స్టడీస్, ఆర్థమెటిక్, రీజనింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాం. 800 మీటర్స్ రన్సింగ్, ఈవెంట్స్‌లో ఎలాంటి మెళకువలు పాటించాలి? పరిగెత్తే సమయంలో సమయాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. రాత పరీక్షల్లో ఎలాంటి పద్ధతులు అవలంబించాలో వివరిస్తాం.
ప్రత్యేకంగా ఈవెంట్స్ కోసం చర్యలు తీసుకున్నారా?
దేహదారుఢ్య పరీక్షల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తాం. ఫిజికల్ ఎక్స్‌పర్ట్ ఆధ్వర్యంలో రన్నింగ్ ఇతర ఈవెంట్స్ సాధన ఉంటుంది. వైద్య సిబ్బంది ప్రతిరోజూ అందుబాటులో ఉంటారు. వీరంతా సాధనలో పొరబాట్లను గుర్తించి ఎప్పటికప్పుడు సరిచేస్తుంటారు.
ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs||Events Tips
కమిషనరేట్ పరిధిలో ఎన్ని ఖాళీ ఉన్నాయి?
కమిషనరేట్ పరిధిలో మాకున్న సమాచారం మేరకు దాదాపు 600 వరకు పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో దాదాపు 550 వరకు కానిస్టేబుల్స్ కాగా, దాదాపు 50 వరకు ఎస్సై పోస్టులు. అయితే.. ఖాళీల వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
TS Police Jobs: తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
అభ్యర్థులకు మీరిచ్చే సూచనలు..?
సంకల్పంతో పరీక్షలకు సంసిద్ధమైతే విజయం చేరుకోవడం కష్టమేమీ కాదు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వామ్యం కావాలనుకున్న వారికి పోలీసు ఉద్యోగం మంచి అవకాశం. లక్ష్యాన్ని చేరుకోవాలన్న కాంక్ష మీలో బలంగా ఉంటే.. ఆ స్వప్నాన్ని నెరవేర్చేందుకు కావాల్సిన శిక్షణ మేమందిస్తాం.
TS Police Jobs: ఈ నిబంధనల ప్రకారమే పోలీసు ఉద్యోగాలు భర్తీ..
Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ కసితోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..
Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..