Young Women Success Story : ఇన్ఫోసిస్ వంటి పెద్ద సంస్థ‌లో ఉద్యోగాల‌ను వ‌దులుకుంది.. ఈ ల‌క్ష్యం కోస‌మే పోరాడి.. చివ‌రికి..!

కొన్ని గొప్ప సంస్థ‌ల్లో వ‌చ్చిన ఉద్యోగ అవ‌కాశాలను వ‌దులుకుంది ఈ యువ‌తి. త‌న క‌ల‌ల కోసమే క‌ష్ట‌ప‌డింది. త‌న త‌ల్లి స‌హ‌కారంతో ఉన్నతంగా చ‌దివి చివ‌రికి గెలుపునే అందుకుంది. ఈ యువ‌తి క‌థేంటో తెలుసుకుందాం..

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్ర‌స్తుతం, యువ‌త‌కు ఎంత‌టి చిన్న‌ ఉద్యోగ‌మైన ఒక వ‌రం అనుకుంటారు. అటువంటిది, ఇన్ఫోసిస్ లేదా విప్రోలాంటి  పెద్ద సంస్థ‌ల‌వారే పిలిచి మ‌రీ ఉద్యోగావ‌కాశం క‌ల్పిస్తే ఏ యువ‌త‌కైన ఇంకేం కావాలి అనుకుంటారు. అయితే, ఇక్క‌డ ఒక యువ‌తి క‌థ వేరే ఉంది. ఈ యువ‌తికి ఇటువంటి పెద్ద సంస్థ‌ల్లోనే ఉద్యోగావ‌కాశాలు వ‌చ్చాయి. అయితే, త‌ను ఆ అవ‌కాశాల‌ను కాదనుకుంది. ఇంత‌టి ఉద్యోగం కాద‌నుకుందా..! ఈ ఉద్యోగాలకు ఎంత‌మంది యువ‌త వేచి చూస్తారు అస‌లు.. అని కొంద‌రు అనుకుంటారు. కాని, ఈ యువ‌తి క‌ల‌, గ‌మ్యం అస‌లు త‌న‌ దారే వేరు.

Youngest Commercial Pilot Success Story: 18 ఏళ్లకే పైలట్‌.. 200 గంటల ఫ్లయింగ్‌ అవర్స్‌తో రికార్డ్‌

నా అడుగులు.. నా ల‌క్ష్యం కోసం..

తెలంగాణ‌లోని జనగామ జిల్లా తిరుమలగిరికి చెందిన ఉప్పునూతల సౌమ్య ఒకవైపు చదువులో ఉన్న‌తంగా  రాణిస్తూనే మ‌రోవైపు.. దుక్కి దున్నడం, పురుగు మందు పిచికారీ చేయడం, కలుపు తీయడంలాంటి వ్యవసాయ పనుల్లో త‌న‌ తల్లిదండ్రులకు తోడుగా చేదోడువాదోడుగా ఉంటుంది. ఐపీఎస్ అవ్వాల‌నే త‌న క‌ల కోసం ఎంతో కృషి చేస్తుంది. అయితే, ఈ క్ర‌మంలోనే త‌న‌కు ఇన్ఫోసిస్ వంటి పెద్ద సంస్థ‌ల్లో ఉద్యోగం ల‌భించ‌గా త‌న క‌ల కోసం తిర‌స్క‌రించింది సౌమ్య‌. త‌న ప్ర‌తీ అడుగు త‌న ల‌క్ష్యం కోస‌మే అంటూ అన్ని విధాలుగా క‌ష్టప‌డుతుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఎంత కావాలంటే అంత‌..

త‌న త‌ల్లిదండ్రులకు వారి స‌మ‌యంలో ఎంతో చ‌ద‌వాల‌నే ఆశ ఉండేది. కాని, ఇంటి ప‌రిస్థితులు, ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా ఎక్కువ చ‌దువుకోలేదు. కాని, త‌న చ‌దువుకు మాత్రం ఏనాడు అడ్డు చెప్ప‌లేదు. తాను ఎంత చ‌ద‌వాల‌నుకుంటే అంత చ‌దివిస్తామ‌ని త‌న‌కు తోడుగా నిలిచారు. త‌న‌ చ‌దువు విష‌యంలో ఏమాత్రం రాజీప‌డ‌లేదు. 

ఈ స‌మ‌యంలోనే నిర్ణ‌యించుకున్నా.. 

గూడూరులోని జిల్లా పరిష‌త్ పాఠ‌శాల‌లో ఒక రోజు నేషనల్‌ క్యాడెట్‌ కార్పస్‌ను ప్రవేశపెట్టినప్పుడు పోలీస్‌ యూనిఫాం పట్ల ఇష్టం ఏర్పడింది. అలా, ఆ ఇష్టం కాస్త ఆశ‌యంగా మారింది. నేడు త‌న తోటి విద్యార్థుల్లో చాలామందికి పెళ్ళిళ్లు అయిపోయాయి. కాని, ఈ విష‌యంలో మాత్రం త‌న త‌ల్లిదండ్రులు త‌న‌ను ఇబ్బంది పెట్ట‌లేదు.

Success Story: తల్లి రైల్వే కూలీ.. బిడ్డకు పవర్‌ లిఫ్టింగ్‌లో బంగారు పతకం

ఉద్యోగం వ‌దిలేసి..

ఢిల్లీలో ప‌ని చేస్తున్న సౌమ్య ఒక‌రోజు తిరిగి ఇంటికి వ‌చ్చేసింది. ఏంటి అంటే.. ఉద్యోగం చేయ‌డం ఇష్టం లేద‌ని తెలిపింది. కార‌ణం తెలీదుకాని, అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్‌ను విడుద‌ల చేసింది ప్ర‌భుత్వం.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

దీనిని ఉప‌యోగించుకొని, త‌న క‌ల వైపుకు న‌డ‌క‌లు ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకుంది సౌమ్య‌. అయితే, ఈ ప‌రీక్ష‌లో నెగ్గడానికి సౌమ్య రాత్రింబ‌గ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ప‌రీక్ష రాసింది. చివ‌రి త‌న క‌ష్ట‌మే త‌నని త‌న గ‌మ్యానికి చేర్చింది. ఈ ప‌రీక్ష‌ల్లో సౌమ్య నెగ్గంది. ఉన్న‌త మార్కులు సాధించి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందింది. 

ఆల్‌రౌండ‌ర్‌గా..

కానిస్టేబుల్‌ శిక్షణ సమయంలో బెస్ట్‌ ఆల్‌రౌండర్, ఇండోర్‌ ట్రోఫీలను గెలుచుకున్న సౌమ్య 2024 బ్యాచ్‌ స్టైపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో 1,211 మంది మహిళా ట్రైనీలకు పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించింది.

త‌ల్లి మాట‌లు..

నా బిడ్డ త‌న క‌ల‌ను సాకారం చేసుకునే ఈ ప్ర‌యాణంలో ఒక గ‌మ్యాన్ని చేరుకుంది. ఖ‌చ్చితంగా త‌న క‌ల‌ను  సాకారం చేసుకుంటుందని న‌మ్ముతున్నాని తెలిపారు. అంతేకాదు, పోలిస్‌ అకాడమీలో మహిళా ట్రైనీలకు పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించిన సౌమ్యను చూసి పొంగిపోయాను. చదువులో మాత్ర‌మే కాదు వ్యవసాయ పనుల్లోనూ  సౌమ్య కష్టపడి పనిచేస్తుంది. చదువులో నేను ఎంతో చేయాల‌నుకున్నాను కాని, నా బిడ్డ మాత్రం ఎంత కావాలంటే అంత చ‌దివిస్తాను. అని సౌమ్య తల్లి త‌న ఆనందాన్ని వ్య‌క్తిం చేశారు.

First Women Safari Driver : ఎన్నో ఆటంకాలు దాటుకొని.. చివ‌రికి తొలి మ‌హిళా స‌ఫారి డ్రైవ‌ర్‌గా చేస్తున్నానిలా... కానీ..!

సౌమ్య మాటలు..

ఢిల్లీలో ఉండి ఉద్యోగం చేసే స‌మ‌యంలో ఇంట్లో అమ్మ‌నాన్న‌లు ఎలా ఉన్నారు వారికి చాలా దూరంగా ఉంటున్నాను అనే ఒక్క దిగులుతో తిరిగి ఇంటికే వ‌చ్చేశాను. ఏదేమైనా, నా క‌ల‌వైపుకు న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్నాను. మా గ్రామంలో ప్రాథ‌మిక విద్య‌ను దాటుకొని ఎవ్వ‌రూ పై చ‌దువులు చ‌ద‌వ‌లేదు. మా అమ్మ ఎంతో చ‌ద‌వాల‌నుకుంది కాని, కొన్ని ఇబ్బందుల కార‌ణంగా చ‌ద‌వ‌లేకపోయింది. కాని, మా విష‌యంలో ఎటువంటి ఇబ్బందులు ఉండ‌కూడ‌ద‌ని ఏమాత్రం రాజీపడలేదు.

Young Women Success Story : స‌క్సెస్ కొట్టాలంటే...వ‌య‌సుతో సంబంధం లేదు... నేను ఈ ఏజ్‎లోనే...

#Tags