Police Job Achievers : చిన్ననాటి కలలతో.. సర్కార్ కొలువులు.. ఇదే వీరి స్టోరీ..
సాక్షి ఎడ్యుకేషన్: వచ్చిన చిన్న, పెద్ద ఉద్యోగాలను కాదనుకొని, కష్టపడి సర్కార్ కొలువులు దక్కించుకుంటున్నారు. ఆదిలాబాద్ పీటీసీలో ట్రైనింగ్ తీసుకున్న కొందరు యువకుల కథ ఇలానే ఉంది..
పోలీస్ కలతోనే..
తన చిన్నతనం నుంచే పోలీస్ కావాలన్నది ఇతని లక్ష్యం. ఇదే లక్ష్యంగా పెట్టుకొని చదివాడు గర్వంద వెంకటేశ్. తన తల్లిదండ్రులు.. మల్లేశం కల్లుగీత కార్మికుడు. అమ్మ వ్యవసాయం చూస్తూ తనను బీటెక్ వరకు చదివించారు. ఇలా, వారి కష్టానికి ఫలితంగా నేడు అనుకున్న లక్ష్యాన్ని నేరవేర్చుకున్నాడు.
తాను చదువుకునే సమయంలో వచ్చిన గ్రూప్-4 ఉద్యోగాన్ని తిరస్కరించి, పోలీస్ కొలువుకు మాత్రమే కృషి చేస్తూ వచ్చాడు. అలా, ఆదిలాబాద్ పీటీసీలో 9 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్నడు. అనంతరం, జగిత్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో తొలి పోస్టింగ్ సాధించాడు.
కల కోసం కొలువును కాదని..
చిన్న వయసులో కన్న పోలీస్ కల కోసం తన అమ్మనాన్నలు వ్యవసాయం చేసుకుంటూ బీటెక్ పూర్తి చేసుకేవరకు చదివించారు. బాదినేని వంశీకి తన చిన్నతనంలోనే పోలీస్ కావాలనేది ఆశయంగా మారింది. అప్పటినుంచే శ్రద్ధగా చదువుకొని, తన అమ్మనాన్నలు తనపై పెట్టుకున్న ఆశలను, వారు పడిన కష్టానకి ఫలితం దక్కాలని బిటెక్ అనంతరం, ఒక పెద్ద కంపెనీలో రూ.10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినా దానిని వదులుకొని, కలలు కన్న వృత్తి కోసం ప్రయాణం చేశాడు. ఇలా, కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి, ఆదిలాబాద్ పీటీసీలో 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని, నేడు శిక్షణలో జగిత్యాల జిల్లా మొదటిస్థానం పొంది, తొలి పోస్టింగ్ జగిత్యాల స్టేషన్‌లోనే పొందాడు. ప్రశంసాపత్రాలు అందుకున్నాడు.
Police Jobs : కలలతో కొందరు.. స్పూర్తితో కొందరు.. పోలీస్ కొలువు కొట్టారిలా..
గ్రూప్-4 కొలువు కొట్టినా కూడా..
చిన్ననాటి నుంచి అమ్మానాన్న నర్సింహారెడ్డి-రాధ వ్యవసాయం చేసుకుంటూ ఎమ్మిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డిని చదివించారు. కన్న కల కోసం, తల్లిదండ్రుల కష్టం ఫలించేందుకు, పట్టుదలతో బీటెక్ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఏడాదికి రూ.6 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగంలో పూర్తిగా రెండేళ్లు పనిచేసాడు శ్రీకాంత్.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని గ్రూప్-4 కొలువు కొట్టాడు. కాని, ఏదో వెలితితో దానిని వదులుకున్నాడు. తరువాత, కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నంచగా, అందుకు సంబంధించిన పరీక్షలను రాసి, సిద్ధమై, 9 నెలల పాటు ఆదిలాబాద్ పీటీసీలో ట్రైనింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. ట్రైనింగ్ అనంతరం, జగిత్యాల పట్టణ పీఎస్‌లో విధుల్లో చేరాడు.
ఇలా, చాలామంది తమ ఆశయాలుగా పోలీస్ అవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకొని కృషి చేస్తున్నారు. ఒకరిని ఒకరు చూసి స్పూర్తి పొంది, తల్లిదండ్రుల కష్టాలకి కూడా ఫలితం దక్కేలా ప్రయత్నాలు చేసి, చివరికి ఉన్నత స్థాయిలో నిలుస్తున్నారు.