Constable Certificates Verification: రెండు రోజుల‌పాటు కానిస్టేబుల్ స‌ర్టిఫికెట్ ప‌రిశీల‌న‌

విడుద‌లైన ప‌రీక్ష ఫ‌లితాల అనుసారం, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల స‌ర్టిఫికెట్లు ప‌రిశీల‌న మొద‌లైంది. ప్ర‌క్రియ‌ను ఎస్పీడీ అధికారులు జ‌రిపారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..
SPD Uday Kumar Reddy verifying the certificates of candidates

సాక్షి ఎడ్యుకేష‌న్: ఇటీవల వెల్లడైన కానిస్టేబుల్‌ తుది ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో గురువారం ప్రారంభమైంది. ప్రక్రియను ఎస్పీడీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు, ఆన్‌లైన్‌లో పొందుపరిచిన వివరాలతో కూడిన డాక్యుమెంట్లను గజిటెడ్‌ అధికారి సంతకంతో కూడిన మూడు సెట్లు, ఆరు ఫొటోలు, ప్రతీ జిరాక్స్‌ పై స్వీయ ధ్రువీకరణతో అందించాలని సూచించారు.

Sports Competitions: ఎస్‌జీఎఫ్ గేమ్స్ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు..

శుక్రవారం కానిస్టేబుల్‌, ఫైర్‌ కానిస్టేబుల్‌, టీ ఎస్‌ఎస్పీ విభాగాల్లోని మిగతా ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. జిల్లాలో సివిల్‌ విభాగంలో 149 మంది, ఏఆర్‌ విభాగంలో 84 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించగా, ధ్రువీకరణ ప్రక్రియకు సివిల్‌ విభాగానికి సంబంధించి నలుగురు, ఏఆర్‌ విభాగానికి సంబంధించి ఒక అభ్యర్థి గైర్హాజరయ్యారు. కార్యక్రమంలో పరిపాలన అధికారులు సంజీవ్‌కుమార్‌, మురళి, ఆశన్న, ప్రసాద్‌, హెడ్‌ క్వార్టర్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌, రిజర్వ్‌ సిబ్బంది పాల్గొన్నారు.
 

#Tags