Twin Brothers Got Same Marks in 10th and Inter : పరీక్షల్లో విచిత్రాలు ఎన్నో.. ఈ కవలలకు టెన్త్, ఇంటర్‌లోనూ..
ఇటీవలే కర్ణాటకలోని హాసన్ ప్రాంతానికి చెందిన కవల అక్కాచెల్లెళ్లు. రెండు నిమిషాల తేడాతో పుట్టిన ట్విన్స్ చుక్కి, ఇబ్బని. వీరు ఒకే పోలికలతో ఉంటారు. అంతేకాదు పరీక్షా ఫలితాల్లో కూడా ఒకేలా మార్కులు తెచ్చుకోవడం విశేషంగా నిలిచింది.
ఈ కవలల మార్కుల మధ్య తేడా కూడా..
ఇలాగే తెలంగాణకు చెందిన రామ్, లక్ష్మణ్ లు కూడా కవలలు. తాజాగా విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాలలో వీరు బెస్ట్ ర్యాంక్స్ సాధించారు. కానీ వీరిద్దరికి వచ్చిన మార్కుల తేడా ఎంతో తెలుసా..? ఈ కవలల మార్కుల మధ్య తేడా కూడా రెండంటే రెండు. ఒకరికి 983 మార్కులు రాగా, మరొకరికి 981 మార్కులు వచ్చాయి. బెస్ట్ మార్కులు సాధించి తల్లిదండ్రులు, లెక్చరర్ల చేత అభినందనలు పొందుతున్నారు.
కుటుంబ నేపథ్యం :
తెలంగాణలోని నల్గొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతులకు కవలలు జన్మించారు. అయితే ఒకే రూపంతో పుట్టిన తమ బిడ్డలకు ఈ తల్లిదండ్రులు రామ్, లక్ష్మణ్ అనే పేరు పెట్టారు. దేవుళ్ళ నామాలతో నామకరణం పొందిన ఈ ఇద్దరు, బాల్యం నుంచే చదువులో రాణిస్తూ.. ఉపాధ్యాయుల చేత తమదైన శైలిలో ప్రశంసలు పొందారు. తమ తల్లిదండ్రులు, లెక్చరర్లు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. తాము భవిష్యత్తులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా స్థిరపడాలని లక్ష్యాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు.
☛ Success Story : 600కు 600 మార్కులు.. ఓ బాలిక రికార్డ్ సృష్టించిందిలా..
ఎడ్యుకేషన్ :
రామ్, లక్ష్మణ్.. ఆత్మకూరు ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివారు. ఇటీవలే సెకండియర్ పూర్తి చేసుకున్న వీరు ఎంపీసీలో ఉత్తమ ర్యాంకు సాధించారు. ఇష్టపడి చదివితే సాధించనిది ఏదీ లేదంటూ నిరూపించారు ఈ కవలలు. ఈ కవలలు టెన్త్‌లో కూడా ఒకే విధంగా..10 కి 10 గ్రేడ్ సాధించారు.
చదవండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?