Tenth Class: ‘పది’ ఇంటర్నల్ తనిఖీలు
వాస్తవ పరిస్థితులపై పరిశీలన చేస్తున్నాయి. అంతర్గత మార్కులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పాఠశాలల యాజమాన్యాలు పొందుపర్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నెల 17వరకు ధ్రువీకరణ బృందాలు పరిశీలించనున్నాయి. ఈ నెల 22 నుంచి 29వరకు బృంద సభ్యులు రికార్డుల పరిశీలన తర్వాత అప్‌లోడ్ చేయాల్సి ఉంది. మార్చి ఒకటి వరకు ఆన్‌లైన్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది.
చదవండి: Tenth Class: వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
సాగుతుందిలా..
ఇంటర్నల్ మార్కుల లోటుపాట్లపై క్షేత్రస్థాయిలో తనిఖీల బృందం పర్యటిస్తోంది. 43 బృందాలతో పరిశీలన సాగుతోంది. ఒక్కో బృందంలో హెచ్‌ఎంతోపాటు మరో ఇద్దరు స్కూల్‌అసిస్టెంట్ టీచర్లను నియమించింది. ఒక్కో బృందానికి నాలుగు నుంచి ఏడు పాఠశాలలు కేటాయించారు. ప్రాజెక్టు వర్క్ ఏం చేశారు.? నోట్‌బుక్‌లో చూసిరాత, ఎఫ్‌ఏ–1, 2 ఫలితాలు పరిగణనలోకి తీసుకుని ఏమేర విశ్లేషించారనే అంశాలను పరిశీలించనున్నాయి.
పది పరీక్షల్లో ప్రతీ పేపర్ 80మార్కులకు ఉంటుంది.
20మార్కులు విద్యార్థుల మార్కుల ప్రావీణ్యత ఆధారంగా పాఠశాలల యాజమాన్యాలు కేటాయించే ఇంట ర్నల్ మార్కులతో విద్యాశాఖ కలపాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలలు ఫార్మెటివ్ అసెస్‌మెంటు(ఎఫ్ ఏ) పేరిట విద్యార్థులు చేసే ప్రాజెక్టు, స్లిప్‌టెస్టుల ఆ ధారంగా మార్కులు వేయాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలలు మాత్రం 20 మార్కులకు గరిష్టంగా 19 మార్కులపైనే వేసినట్లు తెలుస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థికి తక్కువగా వచ్చినా.. ప్రాజెక్టు వ ర్క్‌లు చేయకపోయినా గరిష్ట మార్కులు వేశారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక బృందాలు తనిఖీ నిర్వహిస్తున్నాయి.
ఒక్కో విద్యార్థికి ఏడు స బ్జెక్టులు, నాలుగు ఫార్మెటివ్ అసెస్‌మెంటు మార్కులపై అనుమానాలు ఉన్నాయి. ఒక్కో స్కూల్లో 180 మంది విద్యార్థులు ఉంటే ఏడు సబ్జెక్టులు, నాలుగు ఫార్మెటివ్ అసెస్‌మెంట్లు కలిపితే ఇద్దరు ఉపాధ్యాయులు ఏ విధంగా పరిశీలిస్తారో అధికారులకే తెలియాలి. మొత్తం విద్యార్థులను పరిశీలించకుండానే 20 నుంచి 30శాతం మేర పరిశీలించి చేతులు దులిపేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాఠశాలల యాజమాన్యాలకు తలొగ్గుతాయా..? పారదర్శకంగా ఏ మేర ఉంటాయో తేలాల్సి ఉంది.