10th Class Exams: టెన్త్‌లో ఈ మార్కుల ఎత్తివేత.. గ్రేడింగ్‌ విధానానికి కూడా స్వస్తి..

సాక్షి, హైదరాబాద్‌: పదవతరగతి పరీక్ష విధానంలో ­ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న గ్రేడింగ్‌ను ఎత్తివేసింది.

దీని స్థానంలో గతంలో మాదిరిగానే మార్కు­లను వెల్లడించనున్నారు. ఇప్పటి వరకూ ఉన్న 20 అంతర్గత మార్కులను కూడా ఎత్తివేశారు. ఇక నుంచి వంద మార్కులకు పరీక్ష పేపర్‌ ఉంటుంది. ఈ మార్పులతో కూడిన ఉత్తర్వులను విద్యా­శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం న‌వంబ‌ర్‌ 28న విడుదల చేశారు.

టెన్త్‌ పరీక్ష ఫలితాల్లో 2014 వరకూ మార్కులు ఇచ్చేవారు. ప్రైవేటు స్కూళ్ల ప్రచారం నేపథ్యంలో మార్కుల స్థానంలో గ్రేడింగ్‌ విధానం తీసుకొచ్చారు. తొలిసారి 2014లో మార్కులు, గ్రేడింగ్‌ ఇచ్చారు. 2015 నుంచి కేవలం గ్రేడింగ్‌ మాత్రమే ఉండేది.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

75 శాతం మార్కులు దాటితే వంద మార్కుల వరకూ ‘ఏ’గ్రేడ్‌ ఇచ్చేవారు. అయితే, సీబీఎస్‌సీ, ఇతర స్కూళ్లు ఇప్పటికీ మార్కులు ఇస్తున్నాయి. కొన్ని పరీక్షలకు టెన్త్‌ మార్కులు కోరుతున్నారు. ఇవన్నీ సాంకేతిక సమస్యలు తెస్తున్నాయని భావించిన ప్రభుత్వం పాత విధానాన్ని తీసుకొచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ప్రతీ సబ్జెక్టులోనూ ఇప్పటి వరకూ 20 ఇంటర్నల్‌ మార్కులు ఉండేది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

సంవత్సరంలో నాలుగుసార్లు జరిగే ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల ఆధారంగా ఈ మార్కులు వేసేవారు. దీనిపై పూర్తిస్థాయి పాదర్శకత లోపించిందనే ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రైవేటు స్కూళ్లు ఇష్టానుసారం 20 మార్కులూ వేసుకుంటున్నాయని అధికారులు అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇంటర్నల్‌ మార్కులను కూడా తీసివేసినట్టు విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులు పరీక్ష రాయడానికి 24 పేజీలతో బుక్‌లెట్‌ను కొత్తగా పరిచయం చేస్తున్నారు. సైన్స్‌లో ఒక్కో పేపర్‌కు 12 పేజీల ఆన్సర్‌ షీట్‌ ఇస్తారు.   

#Tags