Summative Assessment Exams: ఎస్‌ఏ–2 పరీక్షలు తేదీలు విడుద‌ల‌

కాళోజీ సెంటర్‌: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఏప్రిల్‌ 8 నుంచి 20 వరకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ–2) పరీక్షలు నిర్వహించనున్నారు.

రివైజ్డ్‌ షెడ్యూల్‌ను అనుసరించి ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను డీఈఓ వాసంతి ఆదేశించారు. ఎంఈఓలు, మండల నోడల్‌ అధికారులు, సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు టైంటేబుల్‌ ప్రకారం 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు విభాగం (డీసీఈబీ) వరంగల్‌ ఆధ్వర్యంలో ప్రశ్నపత్రాలు ముద్రించి మండల రిసోర్స్‌ సెంటర్‌ (ఎంఆర్‌సీ) లకు పంపించారు. రోజూవారీగా పరీక్షలు నిర్వహించిన అనంతరం సంబంధిత సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి విద్యార్థులకు ఫలితాలు వెల్లడించాలని డీఈఓ పేర్కొన్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

రివైజ్డ్‌ షెడ్యూల్‌ ప్రకారం ఎస్‌ఏ–2 పరీక్షలు

అన్ని యాజమాన్యాల పాఠశాలల్లోని 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్‌ అసెస్‌ మెంట్‌ (ఎస్‌ఏ–2) పరీక్షలు రివైజ్డ్‌ షెడ్యూల్‌ ప్రకా రం ఈనెల 8 నుంచి 20వ వరకు నిర్వహించాలని హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేసినట్లు డీఈఓ వాసంతి తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించి, జవాబుపత్రాలను మూల్యాంకనం చే సి విద్యార్థులకు ఫలితాలను అందించాలన్నారు.

#Tags