Tenth Class Students : పదో తరగతి విద్యార్థులకు ఓరియంటేషన్
కాళోజీ సెంటర్: 2023–24 విద్యా సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించేందుకు నేటి నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు సబ్జెక్టు నిపుణులతో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలు కేంద్రాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శిక్షణ కేంద్రానికి కోర్స్ డైరెక్టర్‌గా ఆయా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పర్యవేక్షణ అధికారులుగా ఎంఈఓలు, మండలం నోడల్ అధికారులు వ్యవహరించనున్నారు. 44 కాంప్లెక్స్‌లోని 44 కేంద్రాల్లో, వరంగల్, ఖిలా వరంగల్ మండలాల్లోని కాంప్లెక్స్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న కేంద్రాల్లో రెండు టీంలను ఉపయోగించి శిక్షణ కేంద్రాలు నిర్వహించుకోవాలని కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ విద్యాసంవత్సరంలో వార్షిక పరీక్షలకు హాజరుకానున్న 4,233 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు (10/10) సాధించేలా సిద్ధం చేస్తున్నారు.
10 జీపీఏ సాధించేలా కృషి
మార్చి 2024లో పరీక్షలు రాయనున్న విద్యార్థులకు సబ్జెక్టు నిపుణులతో ఓరియంటేషన్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు 10 జీపీఏ సాధించడమే లక్ష్యం.