Focus should be on 'ten Class' students : ‘10వ తరగతి’ విద్యార్థులపై దృష్టి సారించాలి

‘10వ తరగతి’ విద్యార్థులపై దృష్టి సారించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: పదో తరగతి విద్యార్థుల పై ప్రత్యేక దృష్టి సారించాలని డీఈవో అశోక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంఈవోలు, నోడల్‌ అధికారులతో తొలిమెట్టు, ఉన్నతి, లక్ష్య కా ర్యక్రమాల అమలుపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా అన్ని పాఠశాలల్లో సిలబస్‌ పూర్తి చేసి పదో త రగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఉన్నత, తొలిమెట్టు కార్యక్రమాలను మానిటరింగ్‌ చేసేటప్పుడు ప్రధానంగా ఆరు అంశాలను పరిగణలోకి తీ సుకోవాలన్నారు.

Also Read :  Rishi Sunak : మ‌న‌ విద్యార్థులు బ్రిటన్ వెళ్లాలనుకుంటే.. ఈ కొత్త రూల్స్ పాటించాల్సిందే..

ఉత్తమ ఫలితాలు సాధించా లనే ఉద్దేశంతో తీసుకువచ్చిన లక్ష్య కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఎస్‌వో శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌లో తప్పనిసరిగా మానిటరింగ్‌ వివరాలు అప్‌లోడ్‌ చేయాలన్నారు. ప్రతీ మూడో శనివారం పేరెంట్స్‌, టీచర్ల సమావేశం నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

#Tags