పేద విద్యార్థులకు సాయం అందించేందుకు కృషి

నేలకొండపల్లి: వాసవీక్లబ్‌ ద్వారా పేద విద్యార్థులకు రూ.5 వేల చొప్పున దాదాపు రూ.కోటి వరకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఇరుకుల్ల రామకృష్ణ వెల్లడించారు.

మండల కేంద్రంలోని వాసవీభవన్‌లో ఆగ‌స్టు 25న‌ ఉమ్మడి కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న రెండు వేల క్లబ్‌ల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతీ క్లబ్‌ నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అందిస్తున్నామన్నారు.

చదవండి: Narendra Modi: తెలుగు భాష అద్భుతం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటిదాకా రూ.25 లక్షల విలువైన సేవా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. సమావేశంలో గవర్నర్‌ గుమ్మడవెల్లి శ్రీనివాస్, గంగిశెట్టి గంగాధర, జగదీశ్‌కుమార్, చిదిరాల లింగయ్య, కడవెండి శ్రీనివాస్, రేగూరి హనుమంతరావు, శివకుమార్, దోసపాటి వెంకటేశ్వరరావు, దారా నర్సింహారావు, రేగూరి వాసవి, దోసపాటి చంద్రశేఖర్, గెల్లా కృష్ణారావు, కొత్తా కరుణ, కొత్తా వెంకటేశ్వరరావు, కొత్తా రమేశ్, కొత్తా రాణి, దోసపాటి నాగేశ్వరరావు, దోసపాటి అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు.  

#Tags