Andesri State Anthem: పాఠ్యపుస్తకాల్లో అందెశ్రీ రాష్ట్ర గీతం

సాక్షి, హైదరాబాద్‌: కవి అందెశ్రీ రాసిన రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ..’పాఠ్యపుస్తకాల్లోకి రానుంది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1–10 తరగతుల పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర గీతంగా.. దీన్ని పీఠిక కన్నా ముందు వరుసలో చేర్చనున్నారు.

చదవండి: TG Cabinet Subcommittee: ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల కట్టడి.. ఈ కోచింగ్‌ కేంద్రాలపై నియంత్రణ

ప్రైవేటు విద్యా సంస్థలు సరఫరా చేసే పుస్తకాల్లోనూ ఈ గీతం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర గీతంపై ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పష్టత వచ్చినట్టు అధికారులు తెలిపారు. 

#Tags