TET 2024 Preparation: ‘టెట్‌’కు సన్నద్ధం.. జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల వివరాలు ఇలా..

జనగామ రూరల్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రాసేందుకు బీఎడ్‌, డీఎడ్‌ అభ్యర్థులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు ఎదురుచూస్తుండగా ప్రభుత్వం టెట్‌ నిర్వహించాలని నిర్ణయించడంతో ఆనందం వెల్లివిరిసింది. ఈ మేరకు టెట్‌ షెడ్యూల్డ్‌ను మార్చి 14న‌ ప్రకటించిన విషయం విధితమే. దీంతో జిల్లాలో చాలా మంది అభ్యర్థులు టెట్‌కు సన్నద్ధం అవుతున్నారు. మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత కాంపిటీషన్‌

ప్రతీ ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహించాలని నిబంధన ఉన్న గతంలో నిర్వహించకపోవడంతో అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. డీఎస్సీలో 20 శాతం మార్కులు వేటేజీ ఉండడంతో మరింత స్కోర్‌ చేసుకోవాలని అభ్యర్థులు పట్టుదలతో ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో టెట్‌ నిర్వహించగా మళ్లీ మే నెలలో నిర్వహణకు షెడ్యూల్డ్‌ ప్రకటించడంతో తీవ్ర పోటీ నెలకొంది.

చదవండి: Study Material: టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ దరఖాస్తులు
జిల్లా వ్యాప్తంగా 10 వేల మంది వరకు అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం అవుతుండగా టెట్‌ పరీక్ష నిర్వహణతో డీఎస్సీలో మరింత పోటీ ఉండే అవకాశం ఉంది. జిల్లాలో 221 ఉద్యోగ ఖాళీలు ఉండగా వయోపరిమితి కూడా 46 సంవత్సరాలకు పెంచడం, తదితర కారణాలతో పోటీ పెరుగనుంది. ఎస్జీటీలో 118 పోస్టులు ఉండగా జిల్లా వ్యాప్తంగా సోషల్‌ స్డడీస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌లో ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంది.

చదువుపై దృష్టి సారించేలా..

టెట్‌తో పాటు డీఎస్సీలో ఈసారి ఎలాగైన ఉద్యోగం పొందాలనే పట్టుదలతో అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. టెట్‌ పరీక్షకు గత ఏడాది నుంచి చదువుతున్న వారు ఉన్నారు. జిల్లా నలుమూలల నుంచి ఆయా గ్రంథాలయాలకు వెళ్లి పట్టుదలతో చదువుతున్నారు.

చదవండి: Free Coaching For DSC 2024 : గుడ్‌న్యూస్‌.. డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఉచిత శిక్ష‌ణ‌.. వసతి కూడా..
అయితే టెట్‌ మే 20వ తేదీన ఉండటంతో పరీక్ష సమయం తక్కువగా ఉండటంతో గడువు పొడిగించాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. అలాగే జిల్లా కేంద్రంలో ప్రభుత్వం స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలుపుతున్నారు.

జిల్లాలో పోస్టుల వివరాలు

  • డీఎస్సీ కంటే ముందే నిర్వహణ
  • మరింత పెరగనున్న పోటీ
  • గ్రంథాలయాలకు పెరిగిన తాకిడి
  • జిల్లా వ్యాప్తంగా 10 వేల మందికి పైగా అభ్యర్థులు
  • 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ

స్కూల్‌ అసిస్టెంట్‌లు: 50
లాంగ్వేజ్‌ పండిట్‌లు: 21
ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్లు: 7
ఎస్జీటీలు: 118
స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్లు: 5
స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఎస్జీటీలు: 20
మొత్తం: 221

#Tags