NCF - 2005 ప్రకారం పాఠ్యప్రణాళిక రూపకల్పన ఎలా ఉండాలి ?
1. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) NCF - 2005 ఉద్దేశం - జ్ఞాన నిర్మాణం
బి) పాఠ్యపుస్తకాల రచన కేంద్రీకరణ పద్ధతిలో జరగాలి
1) ఎ, బి రెండూ సరైనవే
2) ఎ సరైంది, బి సరైంది కాదు
3) ఎ, బి రెండూ సరైనవి కావు
4) ఎ సరైంది కాదు, బి సరైంది
- View Answer
- సమాధానం: 2
2. కింది వాటిలో NCF - 2005 ప్రకారం మార్గదర్శక సూత్రం కానిది ఏది?
1) పాఠ్యప్రణాళికలో వ్యవస్థ్థాగత మార్పులు చేయాలి
2) పరీక్షలను సరళీకరించాలి
3) కంఠస్థం చేసే పద్ధతిని నిరుత్సాహ పరచాలి
4) పాఠశాల జ్ఞానాన్ని బయటి జ్ఞానంతో అనుసంధానించాలి
- View Answer
- సమాధానం: 1
3. జతపరచండి.
జాబితా-1
i) అధ్యాయం-01
ii) అధ్యాయం-02
iii) అధ్యాయం-03
iv) అధ్యాయం-04
జాబితా-2
a) పాఠశాల, తరగతి గది వాతావరణం
b) అభ్యసనం, జ్ఞానం
c) దృక్పథం
d) పాఠ్యాంశాలు, పాఠశాల స్థాయి, మూల్యాంకనం
1) i-b, ii-a, iii-c, iv-d
2) i-c, ii-d, iii-a, iv-b
3) i-d, ii-b, iii-c, iv-a
4) i-c, ii-b, iii-d, iv-a
- View Answer
- సమాధానం: 4
4. గుణాత్మక విద్యలో భాగంగా ప్రస్తుతం పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమం ఏది?
1) CLIP
2) QIP
3) LEP
4) CLAPS
- View Answer
- సమాధానం: 3
5. 6 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు రోజుకి ఎన్ని గంటలు ఇంటిపని ఇవ్వాలని NCF - 2005 పేర్కొన్నది?
1) 1 గంటలు
2) 2 గంటలు
3) 3 గంటలు
4) సరిపడినంత ఇవ్వాలి
- View Answer
- సమాధానం: 1
6.NCF - 2005, ఠాగూర్ రచించిన ‘సివిలైజేషన్ అండ్ ప్రోగెస్’ అనే గ్రంథంలోని ఏ వాక్యంతో ప్రారంభమవుతుంది?
1) భారం లేని అభ్యసనం
2) నిరంతరం వెలుగుతున్న దీపమే వేరొక దీపాన్ని వెలిగించగలదు
3) ప్రకృతిలోకి తిరిగిపోదాం
4) సృజనాత్మకశక్తి, సహజమైన ఆనందం బాల్యానికి కీలకం
- View Answer
- సమాధానం: 4
7. కింది వాటిలో NCF - 2005 ప్రకారం సరైంది ఏది?
ఎ) విద్యాహక్కు పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేయాలి
బి) NCF - 2005ను MHRD రూపొందించింది
1) ఎ, బి రెండూ సరైనవి కావు
2) ఎ, బి రెండూ సరైనవే
3) ఎ సరైంది, బి సరైంది కాదు
4) బి సరైంది, ఎ సరైంది కాదు
- View Answer
- సమాధానం: 1
8. అధ్యాయం-01కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) భారం లేని విద్యలోని అంశాల ఆధారంగా పాఠ్యప్రణాళిక భారాన్ని తగ్గించాలి
2) ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా క్రియాశీల అభ్యసనాలను కల్పించాలి
3) జ్ఞాన నిర్మాణ కృత్యాల్లో అభ్యాసకులకు భాగస్వామ్యం కల్పించాలి
4) పాఠ్యప్రణాళిక ఆచరణలో సామాజిక, సాంస్కృతిక అంశాలకు చోటు కల్పించాలి
- View Answer
- సమాధానం: 1
9. NCF - 2005 ప్రకారం కింది వాటిలో సరికానిది ఏది?
1) ఉపాధ్యాయుడు ఉత్తమ సంధానకర్తగా ఉండాలి
2) ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీలు ఉండాలి
3) క్యాపిటేషన్ రుసుం వసూలు చేస్తే దానికి 5 రెట్లు జరిమానా విధించాలి
4) +2 వరకు పని ఆధారిత విద్యను ప్రవేశ పెట్టాలి
- View Answer
- సమాధానం: 3
10. జతపరచండి.
జాబితా-1
i) అధ్యాయం-05
ii) మార్గదర్శక సూత్రం
iii) అధ్యాయం-02
iv) అధ్యాయం-04
జాబితా-2
a) పాఠశాలలో సమాజ భాగస్వామ్యం కల్పించాలి
b) విద్యార్థుల అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
c) ప్రత్యక్ష అనుభవాల ద్వారా బోధించాలి
d) కంఠస్థం చేసే పద్ధతిని నిరుత్సాహ పరచాలి
1) i-c, ii-d, iii-b, iv-a
2) i-d, ii-a, iii-c, iv-b
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-d, ii-c, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 1
11. NCF -2005 ప్రకారం విజ్ఞాన శాస్త్రం ప్రధాన ఉద్దేశం?
1) తార్కిక ఆలోచన
2) సృజనాత్మకతను పెంపొందించడం
3) శాస్త్రీయ వైఖరి కలిగి ఉండటం
4) శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం
- View Answer
- సమాధానం: 2
12. NCF - 2005 ప్రకారం పాఠ్యప్రణాళిక రూపకల్పన ఎలా ఉండాలి?
1) అభ్యాసకుల వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని, వారి వికాస ప్రాకార్యాలకు అనుగుణంగా తయారు చేయాలి
2) పిల్లల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించాలి
3) భారంలేని అభ్యసనానికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా తయారు చేయాలి
4) విషయజ్ఞానం పెంపొందించే విధంగా తయారు చేయాలి
- View Answer
- సమాధానం: 1
13. తరగతిలో వైయుక్తిక భేదాల జ్ఞానం, ఉపాధ్యాయుడికి ఎందుకు తోడ్పడుతుంది?
1) బోధనాభ్యసన కృత్యాల రూపకల్పనకు
2) క్రమశిక్షణ నిర్వహించడానికి
3) తరగతిలో ఏర్పాట్లు చేయడానికి
4) విద్యార్థుల ఇంటిపని మూల్యాంకనం చేయడానికి
- View Answer
- సమాధానం: 1
14.ఉపాధ్యాయ శిక్షణలో ఏ విద్య ఒక భాగంగా ఉండాలి?
1) పని విద్య
2) కళల విద్య
3) ఆరోగ్య విద్య
4) శాంతి విద్య
- View Answer
- సమాధానం: 4
15. సామాజిక శాస్త్రానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) గతంపట్ల పిల్లల దృక్పథాన్ని ప్రభావితం చేసేదిగా చరిత్ర ఉండాలి
2) పౌరశాస్త్రాన్ని రాజనీతిశాస్త్రంగా మార్చాలి
3) పాఠశాలలో సమాజ భాగస్వామ్యం కల్పించాలి
4) సాంఘికశాస్త్ర భావనలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
- View Answer
- సమాధానం: 3
16. కింది వాటిలో అధ్యాయం-02కు సంబంధించింది ఏది?
1) గుణాత్మక విద్యను అందించాలి
2) బోధనా పద్ధతులు ప్రశ్నించడానికి, ఆలోచించడానికి అవకాశం కల్పించాలి
3) నిరంతర సమగ్ర మూల్యాంకనం చేపట్టాలి
4) ప్రజాస్వామ్య పద్ధతిలో స్వీయ క్రమశిక్షణ పెంపొందించాలి
- View Answer
- సమాధానం: 2
17. NCF - 2005 ప్రకారం శిశు కేంద్రీకృత విద్యకు సంబంధించనిది?
1) పిల్లల అనుభవాలకు అవకాశం కల్పించాలి
2) విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యానికి అవకాశం కల్పించాలి
3) జ్ఞాన నిర్మాణంలో ఉపాధ్యాయుడు క్రియాత్మకంగా ఉండాలి
4) పిల్లల ఆలోచనలకు స్థానం కల్పించాలి
- View Answer
- సమాధానం: 3
18. అధ్యాయం-04కి సంబంధించి సరైంది ఏది?
1) ప్రతి విద్యార్థి ఆసక్తులను, శక్తి సామర్థ్యాలను వెలికితీసేలా పాఠశాల సంస్కృతి ఉండాలి
2) ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా క్రియాశీల అభ్యసనాన్ని కల్పించాలి
3) ఉమ్మడి పాఠశాల వ్యవస్థ ఉండాలి
4) ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వాలి.
- View Answer
- సమాధానం: 1
19. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) అధ్యాయం-05 పరీక్ష, సంస్థాగత సంస్కరణల గురించి తెలియజేస్తుంది
బి) రోజుకు ఒక పీరియడ్‌ను గ్రంథాలయానికి కేటాయించాలని ూఇఊ - 2005 పేర్కొన్నది.
1) ఎ, బి రెండూ సరైనవి కావు
2) ఎ సరైంది, బి సరైంది కాదు
3) ఎ సరైంది కాదు, బి సరైంది
4) ఎ, బి రెండూ సరైనవే
- View Answer
- సమాధానం: 2
20. జతపరచండి.
జాబితా-1
i) అధ్యాయం-03
ii) అధ్యాయం-02
iii) అధ్యాయం-05
iv) అధ్యాయం-04
జాబితా-2
a) భాగస్వామ్య, జట్టు కృత్యాలు నిర్వహించాలి
b) మాతృభాషనే అత్యుత్తమ బోధన భాష
c) ప్రతి ఉపాధ్యాయుడు ఒక భాష కోర్సును నేర్చుకోవాలి
d) బోధనావ్యూహాల్లో పిల్లల అనుభవాలకు చోటు
కల్పించాలి
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-a, ii-c, iii-d, iv-b
3) i-b, ii-d, iii-c, iv-a
4) i-d, ii-b, iii-c, iv-a
- View Answer
- సమాధానం: 3
21. అధ్యాయం-05కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) పాఠశాల క్యాలెండర్‌ను వికేంద్రీకరణ పద్ధతిలో తయారు చేయాలి
2) అభ్యసన వైకల్యం ఉన్న వారికి నిర్దిష్ట కార్యక్రమాలను రూపకల్పన చేయాలి
3) నిబద్ధులైన పౌరులను తయారు చేయాలి
4) గ్రామస్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి
- View Answer
- సమాధానం: 4
22. జతపరచండి.
జాబితా-1
i) పని విద్య
ii) శాంతి విద్య
iii) కళా విద్య
iv) ఆరోగ్య విద్య
జాబితా-2
a) హయ్యర్ సెకండరీలో ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టాలి
b) ప్రతి స్థాయిలోనూ ఒక సబ్జెక్ట్‌గా ప్రవేశ పెట్టాలి
c) ఉపాధ్యాయ శిక్షణలో ప్రవేశపెట్టాలి
d) అన్ని సబ్జెక్టుల్లోను ప్రవేశపెట్టాలి
1) i-d, ii-c, iii-b, iv-a
2) i-c, ii-b, iii-d, iv-a
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-d, ii-c, iii-a, iv-b
- View Answer
- సమాధానం: 1
23. కింది వాటిలో NCF -2005 ప్రతిపాదించిన మార్పు ఏది?
1) తరగతిలో అభ్యసనం
2) ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో అభ్యసనం
3) విస్తృత, సామాజిక పరిసరాల్లో అభ్యసనం
4) పుస్తకాల ద్వారా అభ్యసనం
- View Answer
- సమాధానం: 3
24. జ్ఞాన నిర్మాణానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) పెద్దలు ఇష్టపడే, సమాజానికి ఉపయోగపడే జ్ఞానాన్ని అభ్యాసకుడు నిర్మిస్తాడు
2) క్రమబద్ధమైన తరగతి బోధన ప్రాతిపదికగా అభ్యాసకుడు స్వీయజ్ఞానాన్ని నిర్మించుకుంటాడు
3) భారం లేని అభ్యసనం ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు
4) తన అనుభవాల ఆధారంగా అభ్యాసకుడు స్వీయ జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు
- View Answer
- సమాధానం: 4
25. కింది వాటిలో NCF -2005 ప్రకారం సరికానిది ఏది?
1) ఆంగ్లాన్ని బోధనామాధ్యమంగా వక్కాణించడం
2) నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని తెలియజేయడం
3) అభ్యసనంలో నిర్మాణాత్మక ఉపగమం తెలియజేయడం
4) పాఠశాల జ్ఞానాన్ని బయటి జ్ఞానంతో అనుసంధానించడం
- View Answer
- సమాధానం: 1
26. NCF-2005 ప్రకారం ఆంగ్లభాష బోధన ఉద్దేశం దేన్ని నిర్మించడం?
1) ఏక భాషావాదం
2) ఆంగ్లం మాత్రమే
3) బహు భాషావాదం
4) ద్వి భాషావాదం
- View Answer
- సమాధానం: 3
27. NCF-2005 ప్రకారం ఒకటి, రెండు తరగతుల్లో ఉండాల్సిన మదింపు?
1) ఎలాంటి పరీక్షలు లేకుండటం
2) సిలబస్ ఆధారంగా
3) మౌఖిక పరీక్ష
4) సరళమైన రాత పరీక్ష
- View Answer
- సమాధానం: 1
28. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) NCF- 2005 నినాదం ఒత్తిడి లేని అభ్యసనం
బి) NCF-2005 ప్రకారం హయ్యర్ సెకండరీలో ప్రాచీన భాషను ప్రవేశపెట్టాలి
1) ఎ మాత్రమే సరైంది
2) ఎ, బి రెండూ సరైనవి
3) ఎ, బి రెండూ సరైనవి కావు
4) బి మాత్రమే సరైంది
- View Answer
- సమాధానం: 1
29. ‘అంతరదృష్టితో కూడిన అభ్యసనం కోసం వివిధ సబ్జెక్టుల మధ్య జ్ఞానాన్ని అనుసంధానించాలి’ అని NCF & - 2005 ఏ అధ్యాయంలో పేర్కొన్నారు?
1) 2వ అధ్యాయం
2) 5వ అధ్యాయం
3) 1వ అధ్యాయం
4) 3వ అధ్యాయం
- View Answer
- సమాధానం: 1
30.ఉపాధ్యాయులు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బహుళ పాఠ్యపుస్తకాలు పాఠశాలల్లో అందుబాటులో ఉండాలని ఏ అధ్యాయంలో పేర్కొన్నారు?
1) 4వ అధ్యాయం
2) 5వ అధ్యాయం
3) 2వ అధ్యాయం
4) 1వఅధ్యాయం
- View Answer
- సమాధానం: 2