టోఫెల్ కి మీకు మీరే ప్రిపేర్ అవ్వొచ్చు

ఇవాళ ‘హలో అమెరికా’లో ఇస్తున్న ‘టిప్స్’ని సీరియస్‌గా పాటిస్తే మీకు మీరుగా ‘టోఫెల్’కి అద్భుతంగా ప్రిపేర్ కాగలగడమే కాకుండా అందులో మంచి స్కోర్లు తెచ్చుకోవడం కూడా మీకు సాధ్యమవుతుంది.

1.టోఫెల్ పరీక్ష గురించి, దాని ‘టెస్టింగ్’ విధానం గురించి ముందుగా అవగాహన ఏర్పరచుకోండి. యు.ఎస్. యూనివర్శిటీ స్థాయిలో ఇంగ్లిష్‌ని అర్థం చేసుకోవడంలో, వినియోగించడంలో మీ స్థాయిని ఈ అడ్మిషన్ టెస్ట్ ద్వారా అంచనా వేస్తారు. ఇంటర్నెట్ ద్వారా నిర్వహించే (ఐ.బి.టి.) టోఫెల్ స్కోర్లని 130కి పైగా దేశాలలోని 5 వేలకి పైగా విద్యాసంస్థలు ఆమోదిస్తాయి. 165 దేశాలలోని (ఇండియా సహా) 4,500 టెస్ట్ సెంటర్లలో ఏడాదికి 30-40 సార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు. టెస్ట్ సమయం సుమారు 4 గంటలు. రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ అనే నాలుగు విభాగాలలో టెస్ట్ ఉంటుంది.

2. టెస్ట్‌కి హాజరవ్వాలనుకున్న దానికి నాలుగునెలల ముందే ఈ పరీక్షకి రిజిస్టర్ చేసుకోవాలి. ఈపరీక్షకి మీకు అనువైన తేదీని ఎంచుకుని రిజిస్టర్ చేసుకునే ఆన్-లైన్ సదుపాయం కావాలంటే ఇక్కడ ఇస్తున్న వెబ్‌సైట్‌కి వెళ్లండి - www.toeflgoanywhere. org

3. టోఫెల్‌కి మీరు పూర్తిగా ఆన్-లైన్‌లోనే ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. ప్రిపరేషన్ మొదలుపెట్టడానికి ముందు ఈ దిగువ ఇస్తున్న వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ ఉన్న వీడియోలు చూడండి. ఇది టోఫెల్ వీడియో లైబ్రరీ. ఇవి చూస్తే ప్రిపరేషన్ ప్రాసెస్ మీద మీకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది - https://www.ets.org/toefl/ibt/about/ video_library

4. యూ-ట్యూబ్‌లో కూడా టోఫెల్ ప్రిపరేషన్ మీద ఎంతో ఉపయుక్తమైన వీడియోలు ఉన్నాయి. వాటిని కూడా చూడండి - www.youtube.com/toefltv

5. టోఫెల్ అధికారిక నిర్వాహకులైన ఇ.ఇ.ఎస్. వెబ్‌సైట్‌లో ఇక్కడ ఇస్తున్న లింక్‌ని అనుసరిస్తే ఆన్-లైన్‌లో టోఫెల్‌కి ప్రిపేర్ అవ్వడానికి కావలసిన ‘టూల్స్’ గురించి ఎక్స్‌పర్ట్ సలహాలు వీడియో రూపంలో లభిస్తాయి - https://www.ets.org/s/toefl/flash/17494/TOEFL_Resources_Web_Video.htm

6. ఆన్-లైన్ ప్రాక్టీస్ టెస్టులు రెగ్యులర్‌గా చెయ్యాలనుకునేవారు https://toeflpractice.ets.org/లో సూచించిన వివరాల ప్రకారం ఒక క్రమ ప్రణాళిక రూపొందించుకుని ఆ ప్రకారం ప్రాక్టీస్ టెస్టులు చేసుకోవచ్చు.

7. టోఫెల్ టెస్ట్‌కి సంబంధించిన శాంపుల్ ప్రశ్నలు కావలసినవారు ఈ దిగువ వెబ్‌లింక్‌ని అనుసరించి అందులో ఇచ్చిన వివరాల ప్రకారం నమూనా ప్రశ్నలను పొందవచ్చు - https://www.ets.org/toefl/ibt/prepare/sample_questions

#Tags