ఫార్మసీ విద్య: ప్రవేశం కష్టం, ప్రయోజనం అధికం
మనకి ఫార్మసీ అంటే మందుల షాపు, ఫార్మసిస్ట్ అంటే మెడికల్ షాపు నడిపే వ్యక్తి. అమెరికాలో పరిస్థితి వేరు. అక్కడ క్లినిక్‌కి, ఫార్మసీకి, డాక్టర్‌కి సమాన గౌరవం ఉంటుంది. పేషెంట్‌కి ఏ మందులు వాడాలో డాక్టర్లు ఫార్మసిస్ట్‌తో కలసి నిర్ణయిస్తారు. యు.ఎస్.లోని ఫార్మసిస్ట్‌లలో సగం మంది డ్రగ్‌స్టోర్స్‌లో పనిచేసినా మిగిలిన వారిలో చాలా భాగం ప్రిస్క్రిప్షన్ మందులని ఎలా వాడాలో పేషెంట్లకి వివరించే కౌన్సెలింగ్ సర్వీసులలో పనిచేస్తుంటారు. కొందరు వయోవృద్ధుల ఆశ్రమాలలోను, ఫార్మా ఇండస్ట్రీలోను పనిచేస్తున్నారు.
ఫార్మసీ ఎడ్యుకేషన్‌కి కూడా యు.ఎస్.లో మెడిసిన్ తో సమానమైన గౌరవం, విలువ, డిమాండ్ ఉన్నాయి. అడ్మిషన్ ప్రొసీజర్లు టఫ్‌గా ఉన్నా, ఖర్చు ఎక్కువైనా అక్కడ ఫార్మసీ కోర్సులకి విద్యార్థులు క్యూ కడతారు. నిరంతరం వైద్యసేవలు అవసరమైన వృద్ధుల సంఖ్య పెరగడం, ఎప్పటికప్పుడు కొత్త ఔషధాలు వస్తుండడం, బిగ్ చైన్ డ్రగ్ స్టోర్లు అమెరికా అంతటా వ్యాపించడం, డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ల సంఖ్య పెరగడంలాంటి కారణాల వల్ల యు.ఎస్.లో ఫార్మసిస్ట్‌లకి అవకాశాలు పెరిగి ఫార్మసీ విద్యకి గిరాకీ ఏర్పడింది.
రాష్ట్రాల మధ్య ఉన్న ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాల వల్ల ఫార్మసిస్ట్‌లు యు.ఎస్.లో ఏ రాష్ట్రంలోనైనా పనిచేసే వెసులుబాటు ఏర్పడింది. వారు తమ ప్రైవేట్ వెంచర్లు నడుపుకోవడానికి, పార్ట్-టైమ్ పనిచెయ్యడానికి కూడా అవకాశం ఉంది. ఈ సదుపాయాలు ఈ వృత్తిని మరింత ఆకర్షణీయం చేశాయి. అమెరికాలో 2020 నాటికి ఇంకా చాలామంది ఫార్మసిస్ట్‌లలు కావాలని ఒక అంచనా. డిమాండ్‌ని కొంతవరకు తట్టుకోవడానికి అనేక ఫార్మా టెక్నికల్ స్కూళ్ళు తెరిచారు. ఫార్మసిస్టుల అవకాశాలలో కొన్నిటిని ఫార్మసీ టెక్నీషియన్లు ఎగరేసుకుపోతుంటారు కూడా.
అమెరికాలో ఫార్మసీవిద్య విదేశీ విద్యార్థులకు మాత్రం చాలావరకు రెడ్ సిగ్నల్‌నే చూపిస్తుంది. ఇండియాలో ఫార్మసీ డిగ్రీ తీసుకున్నవారు యు.ఎస్.లో ఫార్మసీలో ప్రొఫెషనల్ డిగ్రీని పొందడానికి శ్రమపడాలి. విదేశీ విద్యార్థులు యు.ఎస్.లో నేరుగా ఫార్మసీలో మాస్టర్స్ లెవెల్ కోర్సు చేయడానికి వీలులేదు. యు.ఎస్.లోనే ముందుగా ఫార్మ్-డి చేసిన ఫారిన్ స్టూడెంట్స్‌ని మాత్రమే మాస్టర్స్‌కి పరిశీలిస్తారు. ఫార్మ్-డి అనే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ 4-ఏళ్ల గ్రాడ్యుయేట్ కోర్సు (4-అకడమిక్ ఇయర్స్ లేదా 3-క్యాలెండర్ సంవత్సరాలు). దీనికి క్వాలిఫై అవ్వడానికి కూడా మన విద్యార్థులు ముందుగానే యు.ఎస్.లోని ఒక సెవిస్-సర్టిఫైడ్, అక్రెడిటెడ్ స్కూలులో రెండేళ్ళ ప్రీ- ఫార్మసీ కోర్సు చెయ్యాలి. అంతా చేసిన తర్వాత కూడా అక్కడ కొన్ని స్కూల్స్ మాత్రమే విదేశీ విద్యార్థులకి ఫార్మ్-డిలో ప్రవేశం ఇస్తాయి. ఫారిన్ స్టూడెంట్స్‌కి స్కాలర్‌షిప్‌లు గగనకుసుమాలు! ఉదాహరణకు యూనివర్శిటీ ఆ్‌ఫ్ వాషింగ్టన్ ఫార్మసీ స్కూలు పారిన్ స్టూడెంట్స్ ఫైనాన్షియల్ ఎయిడ్‌కి అర్హులు కారని తన వెబ్‌సైట్‌లో నోట్ ఉంచుంది. పి-కాట్ (ఫార్మసీ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్ https://pcatweb.info/, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ తప్పనిసరి. చాలా స్కూళ్ళు ఫార్మసీ కాలేజ్ అప్లికేషన్ సర్వీస్ (ఫార్మ్-కాస్) ద్వారా మాత్రమే అప్లికేషన్లు తీసుకుంటాయి. ఏఏ స్కూళ్ళు విదేశీ విద్యార్థులని చేర్చుకుంటాయో ఫార్మ్-కాస్ వెబ్‌సైట్‌లో (https://www.pharmcas.org)చూడవచ్చు.
https://www.aacp.org,http:/www.nabp.net, https://www.petersons.com, http:/educationusa.state.gov, https://www.usief.org.inవెబ్‌సైట్లలో మరికొంత సమాచారం లభిస్తుంది. ఫార్మ్-డి తర్వాత ఒకటి రెండేళ్ళ పి.జి. రెసిడెన్సీ ప్రోగ్రాములు చేసే వీలు కూడా ఉంది.