Telangana Contract Jobs & Outsourcing Jobs 2023 : కాలేజీల్లో 2,858 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. పోస్టుల వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని నిరుద్యోగుల‌కు ప్ర‌భుత్వం మ‌రో శుభ‌వార్త చెప్పింది. ఈ సారి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప‌ద్ధ‌తిన పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
Telangana Contract Jobs and Outsourcing Jobs 2023

మొత్తం 2,858 పోస్టులకు గానూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇందులో కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిన 527 మంది లెక్చ‌ర‌ర్ల‌ను, 341 మందిని ఔట్ సోర్సింగ్ ప‌ద్ధ‌తిన‌, 50 మంది టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంట‌ర్ల‌ను హోన‌రేరియం కింద‌, 1,940 మందిని గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పూర్తి వివ‌రాలు ఇవే..

పోస్టు  ఖాళీలు
లెక్చ‌ర‌ర్లు 527
టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంట‌ర్లు 50
గెస్ట్ ఫ్యాక‌ల్టీ 1,940
సీనియ‌ర్ అసిస్టెంట్ 29
డాటా ఎంట్రీ ఆప‌రేట‌ర్  31
స్టోర్ కీప‌ర్  40
జూనియ‌ర్ స్టెనో 01
రికార్డు అసిస్టెంట్ 38
మ్యూజియం కీప‌ర్ 07
హెర్బేరియం కీప‌ర్ 30
మెకానిక్ 08
ఆఫీసు సబార్డినేట్ 157
మొత్తం  2,858 

APPSC/TSPSC Group-2 Jobs Success Tips 2023 : గ్రూప్ -2లో అభ్య‌ర్థులు ఎక్కువ‌గా చేసే లోపాలివే.. వీటిని అధిక‌మిస్తే.. విజ‌యం మీదే..!
 

#Tags