Salary Increment for Anganwadi Employees : అంగన్‌వాడీ కార్యకర్తలకు గుడ్‌న్యూస్‌... వీరి జీతాలు పెంపు.. ఎంత అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : అంగన్‌వాడీ కార్యకర్తల చాలా రోజుల నుంచి జీతాల పెంచాలంటూ.. ద‌ర్నాలు చేస్తున్న విష‌యం తెల్సిందే. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే వేల మంది రోడ్ల పైకి వ‌చ్చి ద‌ర్నాలు చేసిన విష‌యం తెల్సిందే.

అయితే ఇటు తెలంగాణ‌లో గానీ.. అటు అంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గానీ అంగన్‌వాడీ కార్యకర్తల జీతాల పెంపుపై ఇంకా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు. అయితే.. హర్యానా ప్ర‌భుత్వం మాత్రం అంగన్‌వాడీ కార్యకర్తల గౌరవ వేతనం రూ.750, హెల్పర్లకు నెలకు రూ.400 చొప్పున పెంచారు. 10 ఏళ్ల అనుభవం ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.14750, పదేళ్లలోపు అనుభవం ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.13250, సహాయకులకు రూ.7,900 గౌరవ వేతనం అందజేయనున్నారు.

 Anganwadi Jobs Notification 2024 Released : ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. 10, 7వ త‌ర‌గ‌తి అర్హతతోనే.. అంగన్‌వాడీ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్‌ విడుదల..

అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల గౌరవ వేతనాన్ని..

ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం మహిళా శిశు అభివృద్ధి శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల గౌరవ వేతనాన్ని ఆగ‌స్టు 9వ తేదీన‌ పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్‌ సైనీ ప్రకటించిన విష‌యం తెల్సిందే. అయితే ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు ముఖ్యమంత్రి ప్రకటన ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే.. పెంచిన గౌరవ వేతనం ఆగస్టు 16వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుండటం ఊరటనిచ్చే అంశం.

➤☛ Anganwadi jobs News: అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు ఈ అర్హత ఉంటే చాలు..ఉద్యోగం మీదే..

అత్యధిక గౌరవ వేతనం ఇచ్చే రాష్ట్రంగా...

పెరిగిన గౌరవ వేతనంతో రాష్ట్రంలోని 23,486 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 489 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, 21732 మంది అంగన్‌వాడీ సహాయకులు లబ్ధి పొందనున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు అత్యధిక గౌరవ వేతనం ఇచ్చే రాష్ట్రంగా హర్యానా అవతరించింది. ఇప్పటి వరకు పదేళ్ల అనుభవం ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం రూ.14 వేలు కాగా.. ఇప్పుడు రూ.750 పెంచి రూ.14750కి పెంచారు. పదేళ్ల అనుభవం ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇప్పటి వరకు రూ.12,500 అందజేస్తుండగా, ఇప్పుడు ప్రతి నెలా రూ.13,250 అందనుంది. అంగన్‌వాడీ హెల్పర్‌లకు రూ.7,500 బదులు రూ.7,900 అందజేయనున్నారు.

తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంగన్‌వాడీ కార్యకర్తలు ఎంతో ఆశ‌గా జీతాలు పెంపు కోసం ఎదురుచూస్తున్నారు.

➤☛ 11000 Anganwadi Jobs Notification 2024 : భారీ గుడ్‌న్యూస్‌.. 11000 అంగన్‌వాడీల ఉద్యోగాల‌కు నోటిపికేష‌న్‌.. త్వ‌ర‌లోనే.. పోస్టుల భ‌ర్తీ

#Tags