Comedian Brahmanandam Success Story : చదువుకోవడానికి డబ్బు కోసం.. పాత బట్టలు వేసుకుని లారీలకు పెయింట్ వేశా.. ఇంకా కొంద‌రి ఇళ్ల‌ల్లో..

ఎక్కడో ఒక మూరుమూల గ్రామంలో పుట్టి పెరిగిన కుర్రాడు ఇంత స్థాయికి ఎదుగుతాడని ఎవరూ ఊహించి ఉండరు. చెప్పులు కూడా కొనలేని స్థితిలో నుంచి లెక్చరర్‌గా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు.

అలాగే మ‌న తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశంలో చాలా మందికి సుప‌రిచితుడు..మ‌న టాలీవుడ్‌ హాస్య బ్రహ్మ.. ప్ర‌ముఖ న‌టుడు బ్రహ్మానందం. ఈయ‌న‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. 

కొన్ని వందల చిత్రాల్లో నటించిన ఆయన తెలుగు సినీ ప్రేక్షకులను తన హావభావాలతో కట్టిపడేశారు. తాజాగా ఆయన ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన (నేడు) 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ నేప‌థ్యంలో స్టార్‌ కమెడియన్ బ్రహ్మ బ్రహ్మానందం స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

బహ్మనందం ప్రస్థానమిది.. 
బ్రహ్మానందం.. ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. ఎక్కడో మూరుమూల గ్రామంలో పుట్టి పెరిగిన కుర్రాడు ఇంత స్థాయికి ఎదుగుతాడని ఎవరూ ఊహించి ఉండరు. చెప్పులు కూడా కొనలేని స్థితిలో నుంచి లెక్చరర్‌గా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు.

☛ IAS Officer Inspire Success Story : ఓ ప్ర‌ముఖ సినీ నటుడు కొడుకు ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యాడిలా.. కానీ చివ‌రికి..

చదువుకోవడానికి డబ్బు లేకపోవడంతో..
తన వద్ద చదువుకోవడానికి డబ్బు లేకపోవడంతో ఇతరుల సాయంతోనే చదువు పూర్తి చేశారు. తనకు సాయం చేసినవాళ్ల ఇంట్లో చిన్నపాటి పనులు చేసిపెడుతూ ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపాడు. అయితే పీజీ చేసేందుకు తన దగ్గర డబ్బులు లేని పరిస్థితి. అదే సమయంలో వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీ అధికారులు గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేశారు. బ్రహ్మానందం టాలెంట్‌, కామెడీని చూసి ఎంఏ తెలుగులో ఫ్రీ సీట్ ఇచ్చారు. గుంటూరు సమీపంలో నల్లపాడులో చిన్న అద్దెగదుల్లో చేరిన ఆయన అనసూయమ్మ చేసిన ఆర్థిక సాయంతో చదువుకున్నారు. 

పాత బట్టలు వేసుకుని అక్కడికి వెళ్లి లారీలకు..

పీజీ చదువుకునే రోజుల్లో నల్లపాడు రూమ్‌ నుంచి కాలేజీకి వెళ్లే దారిలో లారీలకు పెయింట్‌ వేసేవాళ్లు. సాయంత్రం కాలేజీ అయిపోగానే పాత బట్టలు వేసుకుని అక్కడికి వెళ్లి లారీలకు పెయింట్‌ వేశారు. తాను చేసిన పనికి నాలుగైదు రూపాయలు ఇచ్చేవారని పుస్తకంలో రాసుకొచ్చాడు బ్రహ్మానందం. అలా సొంతంగా పనులు చేసుకుంటూ.. దాతల సాయంతో చదువుతూ తన చదువు పూర్తి చేసి లెక్చరర్‌గా మారాడు. ఆ తర్వాత లెక్చరర్‌ స్థాయి నుంచి టాలీవుడ్‌లోనే ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగిన తీరు అద్భుతం. కళారంగంలో ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.

గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కిన తొలి నటుడిగా..
టాలీవుడ్‌లో ఆయన చేసిన సినిమాలకు ఏకంగా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కిన తొలి నటుడిగా నిలిచారు. కేవలం ముఖ కవళికలతోనే నవ్వించే టాలెంట్‌ ఆయనకు మాత్రమే సొంతం. అందుకే అతన్ని హాస్య బ్రహ్మ అనే బిరుదు పొందారు. బహ్మనందం సినీ ఇండస్ట్రీలో 31 ఏళ్ల పాటు కమెడియన్‌గా అభిమానులను అలరించారు. ఆయన దాదాపు 1200లకు పైగా సినిమాల్లో నటించారు. గతేడాది రంగమార్తాండ చిత్రంలో కనిపించిన ఆయన అనారోగ్య సమస్యల కారణంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు.

IPS inspirational Story : ఈ ఐపీఎస్ స్టోరీ చ‌ద‌వ‌గానే కంటతడి తప్పదు.. చిన్న వ‌య‌స్సులోనే..

డబ్బుల్లేని స్థితి నుంచి వందల కోట్ల ఆస్తులు వ‌ర‌కు..

కొన్ని వందల సినిమాల్లో మెప్పించిన హాస్య బ్రహ్మ ఆస్తులు ఎంత సంపాదించారో తెలుసుకుందాం. చదువుకోవడానికి డబ్బుల్లేని స్థితి నుంచి వందల కోట్ల ఆస్తులు సంపాదించారు. ఇవాళ ఆయన బర్త్‌డే కావడంతో అభిమానుల్లో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ సందర్భంగా  బ్రహ్మానందం ఆస్తుల వివరాలపై ఓ లుక్కేద్దాం. తాజా సమాచారం ప్రకారం.. ఆయన స్థిర, చరాస్థులు కలిపి దాదాపు రూ.500 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమిక అంచనా. ఆయనకు కోట్లు విలువ చేసే అగ్రికల్చర్‌ ల్యాండ్‌ కూడా ఉందట. దీనితో పాటు జూబ్లీహిల్స్‌లో ఓ లగ్జరీ ఇల్లు కూడా. కార్ల విషయానికొస్తే ఆడి క్యూ7, క్యూ8(ఆడి ఆర్8, ఆడి క్యూ7)తో పాటు మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు ఉందట. ఇలా నటుడిగా బ్రహ్మీ బాగానే ఆస్తులు సంపాదించారట. అయితే వీటిపై అధికారిక సమాచారం మాత్రం లేదు.

తనలోని సంఘర్షణలకు..

బ్రహ్మానందం కేవలం నటుడు మాత్రమే కాదు.. చిత్ర కళాకారుడనే విషయం తెలిసిందే. విరామ సమయంలో ఆయన దేవుళ్ల చిత్రాలను గీస్తూ వాటిని హీరోలకు, సన్నిహితులకు బహుమతిగా ఇస్తుంటారు. ఒకప్పుడు విద్యార్థులకు పాఠాలు బోధించిన బ్రహ్మనందం.. నేడు తిరుగులేని నటుడిగా తన పేరు చరిత్రలో లిఖించుకున్నారు. ఇటీవలే మీ బ్రహ్మానందం పేరిట తన ఆత్మకథ రాసుకున్నాడు. ఆ పుస్తకాన్ని మెగాస్టార్, రామ్‌చరణ్‌కు అందించారు. పెద్దగా వివాదాల జోలికి పోలేదని, కానీ తనలోని సంఘర్షణలకు పుస్తకరూపం ఇచ్చానన్నాడు బ్రహ్మానందం. నేటి త‌రానికి బ్రహ్మ బ్రహ్మానందం గారి జీవిత‌ప్ర‌స్థానం స్ఫూర్తిధాయ‌కం.

#Tags