Teachers: బదిలీలు, పదోన్నతులపై అడుగులు

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై న్యాయ పరమైన వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది.
బదిలీలు, పదోన్నతులపై అడుగులు

కేసును త్వరగా విచారించాలని, అవసరమైన ఆదేశాలివ్వాలని కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. టీచర్ల బదిలీలు, పదోన్నతుల వ్యవహారంపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. 2023లో ఈ వివాదం మరింత ముదిరింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుటికీ దాన్ని అమలు చేయకపోవడంతో టీచర్లలో అసంతృప్తి నెలకొంది. ఏడేళ్ళుగా బదిలీలు, పదోన్నతులు చేపట్టలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు మాత్రం నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో మార్గదర్శకాలపై టీచర్లు కోర్టును ఆశ్రయించారు. తమకు అన్యాయం జరుగుతోందని భాషా పండితులు న్యాయస్థానం మెట్లెక్కారు. దీంతో ప్రక్రియపై హైకోర్టు స్టే ఇచ్చింది.

చదవండి: Jobs: ఈ జాబ్‌ల‌ కోసం ఎదురుచూస్తున్న 4 లక్షల మందికి పైగా యువత

ఈ కేసును కోర్టు జూన్‌కు వాయిదా వేసింది. అయితే జూన్‌లో పాఠశాలలు తిరిగి తెరుస్తారు కాబట్టి, ఆ సమయంలో బదిలీలు సాధ్యం కాదు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ అనుకూల సంఘాలపై టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్ష బీజేపీ అభ్యరి్థని గెలిపించారు. దీంతో టీచర్లలో తీవ్ర అసంతృప్తి ఉందని, టీచర్ల ఓట్లు దాదాపు 1.05 లక్షలు తమకు వ్యతిరేకంగా పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ త్వరగా ముగించి, బదిలీలు, పదోన్నతులు కలి్పంచి, టీచర్లను సంతృప్తి పర్చాలనే యోచనలో ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.  

చదవండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు

#Tags