Jobs: వైద్యుల నియామకానికి ఇంటర్వ్యూలు.. తేదీలు ఇవే..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావుండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 40 వేలకు పైగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లలో భర్తీ చేసింది. ఇటీవల ఏపీవీవీపీలో 351 సీఏఎస్‌ఎస్, డీఎంఈలో 622 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో సీఏఎస్‌ఎస్ పోస్టులు 240, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 304 భర్తీ అయ్యాయి. కొన్ని స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇతర నియామక నిబంధనలకు లోబడి అభ్యర్థులు లేకపోవడంతో మిగిలిన పోస్టులు భర్తీ అవ్వలేదు. అలాగే గతంలో భర్తీ కాకుండా కొన్ని మిగిలిపోయాయి.
చదవండి: Medical Officer Jobs: టీటీడీ ఆసుపత్రుల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.53,495 వేతనం
ఈ నేపథ్యంలో డీఎంఈలో మిగిలిపోయిన 304 అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏపీవీవీపీలో 150 సీఏఎస్‌ఎస్ పోస్టులకు వాకిన్ ఇంటర్వూ్యలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులను శాశ్వత ప్రాతిపదికన లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నారు. కాగా ఏపీవీవీపీలో వైద్యుల వినతి మేరకు బదిలీలకు ఇటీవల ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇందుకు 135 మంది వైద్యులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి అక్టోబర్ 12న బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
చదవండి: AIIMS Recruitment 2022: ఎయిమ్స్, బీబీనగర్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
అన్ని పోస్టుల భర్తీకి చర్యలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు ఒక్కటి కూడా ఖాళీగా ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు పోస్టులన్నీ భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే స్పెషలిస్ట్, సూపర్ స్పెషాలిటీ వైద్యుల పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వూ్యలు నిర్వహించనున్నాం. ఈ అవకాశాన్ని వైద్యులు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ వినోద్ కుమార్, కమిషనర్, ఏపీవీవీపీ, ఇన్‌చార్జి డీఎంఈ
చదవండి: Medical Officer Jobs: కాకినాడ ఓఎన్‌జీసీలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..