Anganwadi jobs: అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు.. ఖాళీల వివ‌రాలు ఇలా..

మంచిర్యాల టౌన్‌: చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారంతో పాటు పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్య అందించే అంగన్‌వాడీ కేంద్రాలను సిబ్బంది కొరత వేధిస్తోంది.

ఫలితంగా లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదనే విమర్శలున్నాయి. జిల్లాలో టీచర్‌, ఆయా పోస్టులతో పాటు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సూపర్‌వైజర్‌ పోస్టులు, వీరందరినీ సమన్వయం చేసే జిల్లా సంక్షేమ అధికా రి పోస్టు ఖాళీగా ఉండడం గమనార్హం.

ప్రస్తుతం బెల్లంపల్లి ప్రాజెక్టు సీడీపీవోగా పనిచేస్తున్న స్వరూపరాణికి జిల్లా సంక్షేమ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు క్షేత్రస్థాయి సిబ్బంది కొరత ఉండడంతో ఆయా కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది.

చదవండి: UPSC Latest Notification 2024: యూపీఎస్సీ–కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌–2024.. ఎంపిక విధానం ఇలా..

టీచర్‌ పోస్టు ఖాళీగా ఉన్న అంగన్‌వాడీకేంద్రంను సమీపంలో ఉన్న మరో కేంద్రం టీచర్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చి నిర్వహిస్తున్నారు. దీంతో వారికి రెండు కేంద్రాల్లో సేవలను పూర్తిస్థాయిలో అందించడం కష్టంగా మారుతోంది. ఇక పౌష్టికాహార లోపాలు గుర్తించేందుకు సెప్టెంబర్‌ నెలను పోషణ మాసంగా నిర్వహిస్తుండగా, సిబ్బంది కొరతతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రతీ కేంద్రంలో చిన్నారుల ఎత్తు, బరువు కొలతలు తీసుకుని, పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా ఆహారం అందించడంతో పాటు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సిబ్బంది కొరత కారణంగా ఈ కార్యక్రమాలను తూతూ మంత్రంగానే కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

జిల్లాలో ఇలా..

జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 48 వరకు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల 65 ఏళ్లు నిండి న వారికి రిటైర్‌మెంట్‌ ప్రకటించగా మరో 18 మంది విధులకు దూరమయ్యారు. ఆయా పోస్టులు 247 ఖాళీగా ఉన్నాయి. 65 ఏళ్లు నిండిన వారి ఉద్యోగ విరమణ కారణంగా 116 మంది వెళ్లిపోయారు.

మొత్తం 363 ఖాళీలు ఏర్పడ్డాయి. ఇక ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లుగా 38 మంది పని చేయాల్సి ఉండగా 31 మంది మాత్రమే విధులు నిర్వర్తి స్తున్నారు. ఇందులో నుంచే ఐదుగురు ఇతర జిల్లాలకు డిప్యూటేషన్‌పై ఉన్నారు. ప్రస్తుతం 26 మందే జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు.

డిప్యూటేషన్‌పై వెళ్లిన వారి స్థానంలో కొత్తవారిని నియమించక పోవడంతో ఆయా కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను ఇతర సూపర్‌వైజర్లకు అప్పగించా రు. 2011 జనాభా ప్రకారం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య పెరిగి టీచర్లపై పనిభారం పెరుగుతోంది. మరో వైపు బూత్‌లెవల్‌ అధికారులుగా, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టే వివిధ రకాల కార్యక్రమాల బాధ్యతలు సైతం అంగన్‌వాడీలకే అప్పగిస్తున్నారు. దీంతో వారు పూర్తిస్థాయిలో తమ విధులకు న్యాయం చేయలేక పోతున్నారు.

ఖాళీలను భర్తీ చేయాలని కోరాం

జిల్లాలోని ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్‌, అంగన్‌వాడీ పోస్టులకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులను నివేదించాం. 65 ఏళ్లు దాటిన టీచర్లు, ఆయాల రిటైర్‌మెంట్‌తో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. సమీపంలో ఉన్న అంగన్‌వాడీ టీచర్లకు ఖాళీగా ఉన్న కేంద్రాల అదనపు బాధ్యతలు అప్పగించి నిర్వహిస్తున్నాం. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ప్రతీ లబ్ధిదారుకు పౌష్టికాహారంతో పాటు, చిన్నారులు కేంద్రాలకు వచ్చేలా చూస్తున్నాం.

– స్వరూపరాణి, ఇన్‌చార్జి జిల్లా సంక్షేమశాఖ అధికారి

ఖాళీల సమాచారం..

 

పోస్టు మంజూరు

పనిచేస్తున్నవారు

ఖాళీలు

జిల్లా సంక్షేమ అధికారి

01

 01

 

సూపర్‌వైజర్లు

38

31

07

అంగన్‌వాడీ టీచర్లు

969

903

66

ఆయాలు

969

606

363

మొత్తం

1,977

1,540

437

#Tags