Free Training: ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: జిల్లాలో డిగ్రీ పూర్తిచేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇవ్వనుందని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి సునీత ఫిబ్రవరి 26న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లాలోని నిరుద్యోగులు నేటినుంచి మార్చి ఆరో తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు చేసుకున్న వారికి మార్చి 10వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహిస్తారని చెప్పారు.
చదవండి: Free Coaching: పోటీ పరీక్షలకు గౌరీ గ్రంథాలయంలో ఉచిత శిక్షణ
పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి వరంగల్ వడ్డేపల్లి ఆర్టీసీ కాలనీలో ఐదు నెలల పాటు ఉచిత భోజనంతో పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
#Tags