TGRTC: ఆర్టీసీలో మరో 54 మందికి కారుణ్య నియామకాలు

సాక్షి, హైదరాబాద్‌: చనిపోయిన, అనారోగ్యంతో అన్‌ఫిట్‌ అయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించి మరో 54 మందికి పోస్టింగులు దక్కబోతున్నాయి.

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం రవాణాశాఖ విజయాలపై ఎన్టీఆర్‌ మార్గ్‌లో జరిగే కార్యక్రమంలో సీఎంరేవంత్‌రెడ్డి పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందే 54 మందికి ఆయన నియామక పత్రాలు అందజేస్తారు.  

రవాణాశాఖకు ప్రత్యేక లోగో:

ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే రవాణాశాఖకు ప్రత్యేకంగా లోగోను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ శాఖకు ప్రత్యేకంగా లోగో అంటూ లేదు. ఇటీవల జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయించారు. ఈ మేరకు ఆ లోగోను గురువారం జరిగే కార్యక్రమంలో ఆవిష్కరిస్తారు.

చదవండి: Arif: ఉద్యోగమని నమ్మించి చేపలు పట్టిస్తున్నారు

ఈ సందర్భంగా రవాణాశాఖ, ఆర్టీసీ గత ఏడాదిలో సాధించిన విజయాలను పేర్కొంటూ రూపొందించిన బ్రోచర్‌ను కూడా సీఎం ఆవిష్కరించనున్నారు. ఇటీవల అమలులోకి తెచ్చిన పాత వాహనాల తుక్కు విధానం ఆర్డర్‌ను రవాణాశాఖకు అందజేస్తారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా ప్రతినెలా దాదాపు రూ.300 కోట్ల మేర మహిళలకు ఆదా అవుతోంది. ఇది వారికి పెద్ద లబ్ధిగా ఉంటోందని ప్రభుత్వం పలు సందర్భాల్లో పేర్కొంటోంది.

ఈ పథకం కింద ఇప్పటివరకు 115 కోట్ల 76 లక్షల మంది మహిళలు ప్రయాణించగా.. వారికి రూ.3,902.31 కోట్ల మొత్తం ఆదా అయింది. ఈ నేపథ్యంలో రూ.3902.31 కోట్ల నమూనా చెక్కును మహిళా ప్రయాణికుల బృందానికి ముఖ్యమంత్రి అందజేస్తారు.

#Tags