Six Days Schools Holidays Announcement 2024 : స్కూల్స్‌కు 6 రోజులు సెల‌వులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. ఉత్తర్వులు జారీ.. ఇంకా..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌ల కాలంలో స్కూల్స్‌, కాలేజీల‌కు బంద్‌లు, వ‌ర్షాలు, పండ‌గ‌లు ఇలా.. ఎదో ఒక రూపంలో సెల‌వులు వ‌స్తున్న విష‌యం తెల్సిందే. అయితే తాజాగా మ‌రో సారి స్కూల్స్‌కు వ‌రుస‌గా ఆరు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి.

వివిధ రాష్ట్రాల ప్ర‌భుత్వాలు చ‌లికాలం సెల‌వులను ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఉత్తర్వులు జారీ చేశారు. న‌వంబ‌ర్ 27వ తేదీ నుంచి వ‌రుగా స్కూల్స్‌కు సెల‌వులు ఇచ్చారు. మ‌ళ్లీ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్కూల్స్‌ మూసి వేయబడతాయి.

ఈ పాఠశాలలు, కాలేజీలలో..
మణిపూర్ ప్రభుత్వం నవంబర్ 27 నుంచి కర్ఫ్యూ ప్రాంతాల్లో ఉన్న అన్ని పాఠశాలలు, కాలేజీలు మూసివేయాలని ఆదేశించింది. ఈ కాలంలో, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, విష్ణుపూర్, థౌబాల్, కక్చింగ్, జిరిబాం జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలలో తరగతులు నిర్వహించబడవు.

☛➤ 10th Exam Pattern Changes 2024 : బ్రేకింగ్ న్యూస్‌.. టెన్త్ ప‌రీక్ష‌ల్లో కీల‌క మార్పులు చేసిన ప్ర‌భుత్వం.. ఇక‌పై..

ఈ ప్రాంతాల్లోని పాఠశాలలు కూడా..
డిండోరి జిల్లాలో పులులు, ఏనుగుల సంచారం దృష్ట్యా పండరి పాని, గోపాల్‌పూర్, ఖంహార్ ఖుద్ర, చక్మీ, ఖరీదీహ్, చౌరాదాడార్ ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు నవంబర్ 29, 2024 వరకు సెలవులు ప్రకటించారు. చదా వికాస్‌ఖండ్ బజాగ్ పరిధిలోని కరణ్జియా అటవీ ప్రాంతంలో పనిచేస్తున్న పాఠశాలలు కూడా మూసివేయబడతాయి. 

డిసెంబ‌ర్‌లో సెల‌వులే సెల‌వులు..
డిసెంబరులో క్రిస్మస్ సందర్భంగా.. 25వ తేదీన‌ సెలవు ఉంటుంది. అంతేకాకుండా, 1, 8, 15, 22, 29 తేదీలలో ఆదివారం కావడంతో పాఠశాలలు మూసివేయబడతాయి. కొన్ని పాఠశాలల్లో రెండవ, నాల్గవ శనివారాల్లో కూడా తరగతులు ఉండవు.

☛➤ November 30th All Schools Bandh : న‌వంబ‌ర్ 30వ తేదీన స్కూల్స్ బంద్‌.. కార‌ణం ఇదే...!

మధ్యప్రదేశ్‌లో స్కూల్స్‌కు శీతాకాల సెలవులు..
మధ్యప్రదేశ్ ప్రభుత్వ అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు 6 రోజుల శీతాకాల సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 31, 2024 నుంచి జనవరి 4, 2025 వరకు స్కూల్స్‌కు శీతాకాల సెలవులు ఇచ్చారు. జనవరి 5న ఆదివారం సెలవు ఉన్నందున, విద్యార్థులకు వరుసగా 6 రోజుల సెలవులు రానున్నాయి. తిరిగి స్కూల్స్‌కు జనవరి 6వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభంకానున్నాయి.

2025 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే...

2025 జనవరి  :
☛➤ నూతన సంవత్సరం : 01
☛➤ భోగి : 13
☛➤ సంక్రాంతి : 14
☛➤ క‌నుమ : 15
☛➤ రిపబ్లిక్ డే : 26

ఫిబ్రవరి 2025 : 

☛➤ మహ శివరాత్రి : 26

మార్చి 2025 :
☛➤ హోలీ : 14
☛➤ ఉగాది : 30
☛➤ రంజాన్ : 31

ఏప్రిల్ 2025 :
☛➤ రంజాన్ తర్వాత రోజు : 01
☛➤ బాబు జగజ్జీవనరావు జయంతి :  05
☛➤ శ్రీరామ నవమి :  06
☛➤ అంబేడ్కర్ జయంతి :  14
☛➤ గుడ్ ఫ్రైడే :  18

మే 2025 :
మేడే : 1

జూన్ 2025 :
☛➤ బక్రీద్ :  07

జూలై :  2025
☛➤ మొహర్రం : 06
☛➤ బోనాలు : 21

ఆగస్టు 2025 :
☛➤ స్వతంత్ర దినోత్సవం : 15
☛➤ కృష్ణాష్టమి : 16
☛➤ వినాయక చవితి : 27

సెప్టెంబర్ 2025 :
☛➤ మిలాద్ నబీ : 05
☛➤ బతుకమ్మ మొదటి రోజు : 21

అక్టోబర్ 2025 :
☛➤ గాంధీ జయంతి : 02
☛➤ దసరా తర్వాత రోజు : 03
☛➤ దీపావళి : 20

నవంబర్  2025 :
☛➤ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి : 05

డిసెంబర్ 2025 :
☛➤ క్రిస్మస్ : 25
☛➤ క్రిస్మస్ తర్వాత రోజు : 26

2025 జ‌న‌వ‌రి నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు పూర్తి సెల‌వుల వివ‌రాలు ఇవే...

#Tags