State Level Competitions: రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థుల ప్రాజెక్టులు..

విద్యార్థులకు జిజ్ఞాస ఇన్నోవేటివ్‌ సైన్స్‌ కాంపిటీషన్‌ పోటీలను నిర్వహించగా అందులో చాలా మంది పాల్గొన్నారు. కానీ, అందులో నెగ్గి రాష్ట్రస్థాయికి ఎంపికైన వారు..

సాక్షి ఎడ్యుకేషన్‌ : ఆగస్త్య ఫౌండేషన్‌ కుప్పం వారి ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు జిజ్ఞాస ఇన్నోవేటివ్‌ సైన్స్‌ కాంపిటీషన్‌ పోటీలను ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈ పోటీల్లో రెండు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనగా ఇందులో నుంచి 206 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వీటిని పరిశీలించి ఇందులో నుంచి 46 ప్రాజెక్టులను రెండు రాష్ట్రాల నుంచి రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు.

Exam Preparation: ఈ 14 టిప్స్ ఫాలో అయితే... పరీక్ష ఏదయినా... విజయం మీదే!!

వైఎస్సార్‌జిల్లా నల్లపురెడ్డిపల్లె జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు ఇలియాస్‌, అమృతనాయుడు కలిసి రూపొందించిన శ్ఙ్రీకూలింగ్‌ హెల్మెన్‌శ్రీశ్రీ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కమలనాథశర్మను జిల్లా సైన్స్‌ అధికారి మహేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎద్దుల రాఘవరెడ్డిలు అభినందించారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన 46 ప్రాజెక్టుల విద్యార్థులకు జనవరి 9,10 తేదీల్లో వర్చువల్‌గా కాంపిటీషన్‌ నిర్వహించనన్నారు. వీరిలో ముగ్గురి ప్రాజెక్టులను జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు.

#Tags