School Inspection: ఈ విద్యార్థులపై ఉపాధ్యాయుల శ్రద్ధ ప్రత్యేకంగా ఉండాలి..
అకస్మాత్తు తనిఖీలను నిర్వహించిన జిల్లా విద్యాశాఖాధికారి పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టిని చూపాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు..
సాక్షి ఎడ్యుకేషన్: పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ అన్నారు. ఎ.కోడూరు పాఠశాలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
➤ Telugu Talent Test: తెలుగు ప్రతిభ పరీక్షలో మరుపాక విద్యార్థి ద్వితియ స్థానం..
ఈ సందర్భంగా పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న అదనపు తరగతుల వివరాలను, ఉపాధ్యాయుల బోధన ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఎంఈవోలు సత్యనారాయణ, డి.వి.డి.ప్రసాద్, హెచ్‌ఎం కామేశ్వరరావు డీఈవో వెంట ఉన్నారు.
#Tags