Parents Teachers Meeting : రేపే మెగా పేరెంట్స్ డే..
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని ప్రతి పాఠశాలలో ఈనెల 7వ తేదీ శనివారం మెగా పేరెంట్స్ డే నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 1,363 పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థి ఏసబ్జెక్టులో బాగా చదువుతున్నది.. ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నదీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో చర్చించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మెగా పేరెంట్స్ డే సమావేశాలకు తల్లిదండ్రులంతా తప్పక హాజరుకావాలని కోరారు.
Apprentice Mela At ITI College: ఐటీఐ విద్యార్థుల కోసం.. ఈనెల 9న అప్రెంటిస్ మేళా
తొలుత రాష్ట్ర మానవవనరుల అభివద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్ బాలాజీ, జిల్లాలో మెగా పేరెంట్స్ డే నిర్వహణ ఏర్పాట్లను వివరించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags