AP Govt schools: విద్యార్థుల సంఖ్య పెరిగింది

పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద అమలు నేపథ్యంలో మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల సంఖ్య పెరిగింది. పోషకాహారం అందిస్తుడడంతో పిల్లలను బడుల్లోనే భోజనం చేసేలా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఎంఈఓలు, ఉపాధ్యాయులు, పేరెంట్స్‌ కమిటీ పర్యవేక్షణలో నాణ్యతలో రాజీ పడకుండా పథకాన్ని అమలు చేస్తున్నాం.
– కె.శామ్యూల్‌, జిల్లా విద్యాశాఖాధికారి

ఎంతో బాగుంది
పాఠశాలలో మధ్యాహ్నం పెడుతున్న జగనన్న గోరుముద్ద ఎంతో బాగుంటుంది. నేను రోజూ బడిలోనే భోజనం తింటున్నాను. దీనికోసం ప్రత్యేకంగా భోజనశాల షెడ్‌ ఏర్పాటు చేశారు. నీటి సౌకర్యం కూడా బాగుంది. జగన్‌ మామయ్యకు థ్యాంక్స్‌.
– వేముల భువనేశ్వరి, 8వతరగతి, మున్సిపల్‌ బాలికోన్నత పాఠశాల

చ‌ద‌వండి: Children's Education: చిన్నారుల చదువుకు మెరుగులు

గుడ్డు, రాగిజావ ఇస్తున్నారు
ప్రభుత్వ మెనూ ప్రకారమే భోజనం పెడుతున్నారు. ఆరు రోజులు గుడ్డు అందిస్తున్నారు. మూడు రోజులు రాగిజావ ఇస్తున్నారు. మరో మూడు రోజులు వేరుశెనగ చిక్కీ అందిస్తున్నారు. ఆనందంగా ఉంది.
– పిట్టా ప్రసన్నకుమార్‌, 10వతరగతి, జడ్పీ హైస్కూల్‌, కొత్తపల్లి, రొంపిచర్ల మండలం

శుచిగా.. రుచిగా..
రోజూ మధ్యాహ్నం విద్యార్థులకు జగనన్న గోరుముద్దను శుచిగా.. రుచిగా అందిస్తున్నాం. నాతోపాటు ప్రతిరోజూ ఒకరిద్దరు ఉపాధ్యాయులు గోరుముద్ద పంపిణీని పర్యవేక్షిస్తుంటాం. గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులతోపాటు స్థానికంగా ఉన్న విద్యార్థులూ గోరుముద్దను స్వీకరిస్తున్నారు. దాదాపు 95శాతం విద్యార్థులు గోరుముద్ద తింటున్నారు.
– తిరుమలశెట్టి మాధవి, హెచ్‌ఎం, జెడ్పీ హైస్కూల్‌, కొత్తపల్లి

#Tags