Navodaya Vidyalaya School Admission news: నవోదయ విద్యాలయాల ప్రవేశాలకు గడువు పెంపు

Navodaya vidyalaya admissions

రాజంపేట: విద్యార్థుల భవిష్యత్‌ ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నవోదయ విద్యాలయ సమితి కృషి చేస్తోంది. క్రమశిక్షణకు మారుపేరుగా మారిన ఈ విద్యాలయంలో సీటు పొందిన వాళ్లు అన్ని రంగాల్లో రాణించేలా.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేలా ప్రత్యేక తీర్ఫీదునిస్తుంది. 

KGBV Recruitment 2024: KGBVలో ఉద్యోగాలు: Click Here

దరఖాస్తుల స్వీకరణ
ఒక్కసారి ఇందులో చేరితే పిల్లల భవిష్యత్తుకు ఢోకా ఉండదని తల్లిదండ్రులు భావిస్తారు. 2025–26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. జిల్లాలో మదనపల్లె సమీపంలోని వలసపల్లిలో, రాజంపేటలో నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి గడువు కూడా పెంచారు. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
80 సీట్లకు గాను నవోదయ విద్యాలయ సమితి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తుండగా సెప్టెంబర్‌ 23వ తేదీతో గడువు ముగుస్తుంది. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సీటు సాధించిన బాల,బాలికలు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యనభ్యసిస్తారు. జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags