International Model School: వైరాలో ఇంటర్నేషనల్‌ మోడల్‌ స్కూల్

అధికారులతో సమీక్షిస్తున్న మల్లు భట్టి విక్రమార్క వైరా నియోజకవర్గ కేంద్రంలో ఇంటర్నేషనల్‌ మోడల్‌ స్కూల్‌ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూమిని సేకరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను అదేశించారు.

ఎన్నికల హామీలో భాగంగా ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠశాలలు నిర్మించనున్నట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం తన స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మీపురానికి బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. వైరాలో 100 పడకల ఆస్పత్రి, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి స్థలాలు సేకరించాలన్నారు. 

వైరా నదిపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి రూ.4.80 కోట్లు మంజూరు కానుండగా.. చేపట్టాల్సిన పనులపై ఇరి గేషన్‌ ఈఈ బాబూరావు, డీఈ శ్రీనివాసరావుతో ఆరా తీశారు. కాగా, మహాశివరాత్రి సందర్భంగా స్నానాల లక్ష్మీపురంలో జరిగే శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర సమయానికి వైరా నదిలో స్నానఘట్టాల నిర్మాణం పూర్తి చేయాలని భట్టి ఆదేశించారు. ఇంకా వర్షాకాలంలో వరద వస్తే లక్ష్మీపురంలోని పొలాల్లోకి నీరు చేరకుండా కరకట్ట నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు.

కాగా, వైరా రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాల్వల మరమ్మతు, అభివృద్ధి కోసం రూ 87.80 కోట్ల నిధులతో ప్రతిపాదనలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించగా పరిశీ లిస్తానని ఆయన తెలిపారు. ఇంకా స్నానాల లక్ష్మీపురం నుండి గండగలపాడు వరకు బీటీ రోడ్డు నిర్మాణ ప్లాన్‌ను మార్చి తల్లాడ రోడ్డుకు కలపాలని, గన్నవరం నుండి రాపల్లె, బ్రాహ్మణపల్లి వరకు లింకు రోడ్లు, శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, స్నానాల లక్ష్మీపురం – గండగలపాడు మధ్య డబుల్‌ రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

Inter Exams 2024 : ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు హెల్ప్‌లైన్‌ నంబర్‌

 

#Tags